సరికొత్త ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ సెడాన్ కార్లు వస్తున్నాయి!
అమెరికాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న తమ ఎంట్రీ లెవల్ కారు 'ఫోర్డ్ ఫిగో' (Ford Figo)లో కంపెనీ ఓ కొత్త వెర్షన్‌ను ఈ ఏడాది మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్ రూపంలోనే కాకుండా కాంపాక్ట్ సెడాన్ రూపంలో కూడా లభ్యం కానున్నట్లు సమాచారం.
వాస్తవానికి ఫోర్డ్ ఇప్పటికే తమ సరికొత్త ఫిగో హ్యాచ్‌బ్యాక్‌ను బ్రెజిల్ మార్కెట్లో విడుదల చేసింది. అక్కడి మార్కెట్లో ఇది ఫోర్డ్ కా (Ford Ka) పేరుతో అమ్ముడుపోతోంది. కొత్త ఫిగో మార్కెట్లోకి రానున్న నేపథ్యంలో, కస్టమర్లు ప్రస్తుత ఫిగో కారును కొనుగోలు చేయటం వాయిదా వేసుకుంటున్నారు. సగటున నెలకు 1500 యూనిట్లు అమ్ముడుపోయే ఫిగో, గడచిన డిసెంబర్ నెలలో కేవలం 151 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి.
ఈ పరిస్థితిని గమనిస్తుంటే.. క్షీణిస్తున్న ఫిగో అమ్మకాలను పెంచుకునేందుకు ఫోర్డ్ అనుకున్న సమయం కన్నా ముందుగానే తమ కొత్త ఫిగోని ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కొత్త ఫిగోకి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కొత్త తరం ఫోర్డ్ ఫిగో మార్కెట్లోకి వస్తే, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఫిగో ఉత్పత్తిని కంపెనీ నిలిపివేసే ఆస్కారం ఉంది.

ఫోర్డ్ ఇండియా తమ నెక్స్ట్ జనరేషన్ ఫిగో కారును గుజరాత్‌లో ఏర్పాటు చేస్తున్న సనంద్ ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. ఈ కొత్త ప్లాంట్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది.

ఫోర్డ్ ప్రదర్శించిన కా కాన్సెప్ట్‌కి ప్రొడక్షన్ వెర్షనే ఈ నెక్ట్స్ జనరేషన్ ఫోర్డ్ ఫిగో. స్మోక్డ్ హెడ్‌ల్యాంప్స్, క్రోమ్ హారింజాంటల్ స్లాట్స్, బ్లాక్ హనీకోంబ్ గ్రిల్ డిజైన్ వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు.

బ్రెజిల్ మార్కెట్లో కంపెనీ విడుదల చేసిన ఫోర్డ్ ఫిగో మోడల్‌నే ఇండియాలోను విడుదల చేయనుంది. ఇందులో 1.4 లీటర్ డీజిల్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్లనే ఉపయోగించనున్నారు. అయితే, ఇందులో సరికొత్త 1.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్ (ఈకోస్పోర్ట్ మోడల్‌లో ఆఫర్ చేస్తున్నది)ని కూడా ఫోర్డ్ ఇండియా ఆఫర్ చేసే అవకాశం ఉంది.

నెక్స్ట్ జనరేషన్ ఫోర్డ్ ఫిగో తర్వాత, ఇందులో ఓ కాంపాక్ట్ సెడాన్ వెర్షన్ కూడా మార్కెట్లోకి రానుంది. కంపెనీ ఇప్పటికే ఈ మోడల్‌ను గడచిన సంవత్సరం జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ మోడల్‌ను ప్రదర్శనకు ఉంచింది. భారత మార్కెట్లో ఇది హోండా అమేజ్, మారుతి స్విఫ్ట్ డిజైర్, టాటా జెస్ట్ వంటి కాంపాక్ట్ సెడాన్లతో పోటీ పడనుంది.


Click it and Unblock the Notifications








