ఫోర్డ్ కా ప్లస్ కాంపాక్ట్ సెడాన్ ఆవిష్కరణ; 2015లో ఇండియా లాంచ్

By Ravi

అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్‌కి చెందిన బ్రెజిల్ విభాగం ఫోర్డ్ బ్రెజిల్ ఇటీవలే ఆవిష్కరించిన ప్రొడక్షన్ వెర్షన్ ఫోర్డ్ కా హ్యాచ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసిన ఫోర్డ్ కా ప్లస్ (Ford Ka+) సెడాన్‌ను తాజాగా ఆవిష్కరించింది.

ఫోర్డ్ కా హ్యాచ్‌బ్యాక్ భారత మార్కెట్‌కు నెక్స్ట్ జనరేషన్ ఫోర్డ్ ఫిగోగా రానుంది. అలాగే ఈ కొత్త ఫోర్డ్ కా ప్లస్ సెడాన్ కూడా ఫోర్డ్ ఫిగో ఆధారిత కాంపాక్ట్ సెడాన్ (4 మీటర్ల కన్నా పొడవు తక్కువగా ఉండే సెడాన్)గా 2015లో ఇండియాలో విడుదల కానుంది.

అయితే, బ్రెజిల్ మార్కెట్ కోసం తయారు చేస్తున్న ఫోర్డ్ కా ప్లస్ సెడాన్ మాత్రం పొడవులో 4 మీటర్ల కన్నా ఎక్కువగా ఉంది. కాగా.. ఇది ఇండియాకు వచ్చే సరికి దీని పొడవను 4 మీటర్ల కన్నా తక్కువకు కుదించనున్నారు.


భారత మార్కెట్లో కాంపాక్ట్ కార్సపై లభిస్తున్న ఎక్సైజ్ సుంకం రాయితీలను పొందేందుకే ఫోర్డ్ ఈ మార్పులు చేయననుంది. ఫోర్డ్ ఇండియా గడచిన ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌లో కూడా తమ ఫోర్డ్ కా కాన్సెప్ట్ సెడాన్‌ను ప్రదర్శనకు ఉంచింది.

కాన్సెప్ట్ వెర్షన్ ఫోర్డ్ కా సెడాన్‌కు మరియు తాజాగా ఆవిష్కరించిన ప్రొడక్షన్ వెర్షన్ ఫోర్డ్ కా ప్లస్ సెడాన్‌కు డిజైన్‌లో పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఏమీ లేవు. చిన్నపాటి మార్పులు మాత్రమే ఉన్నాయి. కొత్త ఫోర్డ్ ఫిగో సెడాన్ రాకతో ప్రస్తుత ఫోర్డ్ క్లాసిక్ అమ్మకాలు నిలిచిపోయే అవకాశం ఉంది.

Ford Ka Concept

ప్రస్తుతం ఫోర్డ్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ సెడాన్ ఫోర్డ్ క్లాసిక్ మాత్రమే. గతంలో ఈ మోడల్‌ను ఫోర్డ్ ఫియస్టాగా విక్రియించేవారు. అయితే, గ్లోబల్ మోడల్ ఫియస్టాను ఇండియాలో పరిచయం చేసిన తర్వాత దీని ధరను తగ్గించి, ఫోర్డ్ క్లాసిక్‌గా విక్రయించడం ప్రారంభించారు.

కాగా.. బ్రెజిల్ మార్కెట్ కోసం తయారు చేసిన ఫోర్డ్ కా ప్లస్ సెడాన్‌లో 1.5 లీటర్ మరియు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్లను ఉపయోగించనున్నారు. ఇండియన్ వెర్షన్ ఫోర్డ్ కా ప్లస్ కాంపాక్ట్ సెడాన్‌లో డీజిల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, June 13, 2014, 11:27 [IST]
English summary
Ford Brazil has revealed the Ka+ compact sedan on the internet. The Ka+ is the sedan version of the Ka hatchback that was revealed a few days back.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+