సరికొత్త 2014 ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ విడుదల!
అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న పవర్‌ఫుల్ ఎస్‌యూవీ ఎండీవర్‌లో ఓ కొత్త 2014 వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. స్పోర్టీ, టఫ్ అండ్ అట్రాక్టివ్ అప్పీల్‌నిచ్చే ఈ అప్‌గ్రేడెడ్ ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ ధర రూ.19.83 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
ఆకర్షనీయమైన లుక్ అత్యుత్తమ ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కలిగిన ఈ 2014 ఫోర్డ్ ఎండీవర్ ఇప్పుడు మరింత రిఫ్రెష్డ్ డిజైన్‌ను పొందింది. మరింత బోల్డ్‌గా కనిపించే ఫ్రంట్ గ్రిల్, సరికొత్త హెడ్‌ల్యాంప్స్‌తో ఇది ముందు వైపు నుంచి సరికొత్త లుక్‌ని కలిగి ఉంటుంది.

ఫోర్డ్ తమ కొత్త 2014 ఎండీవర్ ఇంటీరియర్స్‌లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసింది. ఈ కొత్త ఇంటీరియర్స్ ఇప్పుడు మరింత మోడ్రన్ లుక్‌ని కలిగి ఉంటాయి. ఈ ఆల్-టెర్రైన్ ఎస్‌యూవీ మూడు ఆప్షన్లలో లభ్యం కానుంది.
ఇందులో బేస్ వేరియంట్‌లోనే స్మార్ట్ ఫీచర్లను ఆఫర్ చేస్తున్నారు. ఇది మంచి ధరకు తగిన విలువను కలిగి ఉంటుంది. ఇది మొత్త మూడు ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది. బేస్ వేరియంట్లో 2.5 లీటర్ టిడిసిఐ డ్యురాటార్క్ ఇంజన్‌ను ఉపయోగించారు.

ఇది టూవీల్ డ్రైవ్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఈ వేరియంట్ ధర రూ.10.84 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). రెండవ ఆప్షన్ (మిడ్-వేరియంట్) విషయానికి వస్తే.. ఇందులో 3.0 లీటర్ డిటిసిఐ డ్యురాటార్క్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది టూవీల్ డ్రైవ్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో లభ్యం కానుంది.
ఇకపోతే మూడవ ఆప్షన్ (టాప్-ఎండ్ వేరియంట్)లో కూడా ఇదే 3.0 లీటర్ ఇంజన్ ఉపయోగించారు. కాకపోతే ఇది ఫోర్-వీల్ డ్రైవ్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభ్యమవుతుంది. వీటి ధరలు వరుసగా రూ.21.28 లక్షలు మరియు రూ.23.06 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి.

మూడు వరుల సీటింగ్ కెపాసిటీ (7 సీటర్), విశాలమైన లెగ్‌రూమ్, ప్రీమియం లెథర్ సీట్స్, లేటెస్ట్ శాట్‌నావ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నావిగేషన్, బ్లూటూత్ ఆడియో కంట్రోల్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా అనేక విలాసవంతమైన ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








