ఫోర్డ్ మస్టాంగ్‌లో రైట్-హ్యాండ్ డ్రైవ్ వెర్షన్; భారత్‌కు వస్తుందా?
ఫోర్డ్ మస్టాంగ్ కార్లను మనం హాలీవుడ్ సినిమాల్లో (ప్రత్యేకించి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ వంటి కార్ సంబంధిత చిత్రాల్లో) లేదా విదేశాల్లో (ఎక్కువగా అమెరికాలో) మాత్రమే చూసి ఉంటాం. కానీ త్వరలోనే ఈ కారును ఇండియాలో కూడా చూసే అవకాశం మనకు రాబోతుంది. అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ మోటార్స్ అందిస్తున్న కండలు తిరిగిన 'ఫోర్డ్ మస్టాంగ్' (Ford Mustang)లో కంపెనీ ఇప్పుడు రైట్-హ్యాండ్ డ్రైవ్ (కుడి చేతి వైపు స్టీరింగ్) కలిగిన వెర్షన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.
ఫోర్డ్ మస్టాంగ్ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కేవలం లెఫ్ట్-హ్యాండ్ డ్రైవ్ (ఎడమ చేతి వైపు స్టీరింగ్) కలిగిన వెర్షన్లో మాత్రమే లభ్యమవుతూ వస్తోంది. ఇందులో రైట్-హ్యాండ్ డ్రైవ్‌ను పరిచయం చేయబోవటం ఇదే మొట్టమొదటి సారి. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న (ప్రత్యేకించి ఏషియా) మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని ఫోర్డ్ ఇందులో ఈ కొత్త వెర్షన్‌ను తయారు చేస్తున్నట్లు సమాచారం.
ఇదే విషయంపై ఫోర్డ్ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ గ్లోబల్ ఛీఫ్ రాజ్ నాయర్ ఓ ఆంగ్ల పత్రికు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారతదేశంలో ఫోర్డ్ మస్టాంగ్‌కు చాలా అభిమానులు ఉన్నారని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి చూస్తుంటే, ఈ కారును ఇండియాలో కూడా విడుదల చేయనున్నట్లు ఆయన సూచనప్రాయంగా వెల్లడించినట్లు తెలుస్తోంది. అంతకు మించిన వివరాలను మాత్రం ఆయన తెలుపలేదు.
ఫోర్డ్ మస్టాంగ్ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

విభిన్నమైన స్పోర్ట్స్ కార్
సాధారణ స్పోర్ట్స్ కార్ల కన్నా ఫోర్డ్ మస్టాంగ్ విభిన్నంగా ఉంటుంది. భారీగా కనిపించే ఈ కారు అంతే భారీ పెర్ఫామెన్స్‌ను కలిగి ఉంటుంది. ధృడమైన నిర్మాణం దీని సొంతం. అందుకే ఈ కారును కండలు తిరిగిన కారు (మజిక్యులర్ కార్)అని ముద్దుగా పిలుస్తుంటారు.

బాడీ స్టయిల్స్
ఫోర్డ్ మస్టాంగ్ 2-డోర్ కూపే (2 మరియు 2+2 సీటింగ్), హ్యాచ్‌బ్యాక్, ఫాస్ట్‌బ్యాక్ మరియు కన్వర్టిబల్ బాడీ స్టయిల్స్‌లో లభిస్తుంది. స్టాండర్డ్ ఫోర్డ సెడాన్ సెడాన్ వేరియంట్ మస్టాంగ్ అస్సలు తయారే కాలేదు.

పవర్‌ఫుల్ ఇంజన్స్
మస్టాంగ్ కూపే మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్లతో (3.7 లీటర్ వి6, 5.0 లీటర్ మస్టాంగ్ జిటి, 5.8 లీటర్ సూపర్‌ఛార్జ్‌డ్ వి8) లభిస్తుంది.

మొట్టమొదటి మస్టాంగ్
మస్టాంగ్‌ను తొలిసారిగా ఏప్రిల్ 17, 1964లో న్యూయార్క్‌లో విడుదల చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ డజన్ల కొద్దీ స్పెషల్ ఎడిషన్లు, మోడిఫైడ్ మస్టాంగ్‌లు చాలానే పుట్టుకొచ్చాయి.

స్పెషల్ ఎడిషన్ మస్టాంగ్
ఈ ఏడాది ఫోర్డ్ మస్టాంగ్ బ్రాండ్ 50 వసంతాలు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో 2014 న్యూయార్క్ ఆటో షోలో ఫోర్డ్ మోటార్స్ ఓ స్పెషల్ ఎడిషన్ మస్టాంగ్‌ను విడుదల చేయనుంది.


Click it and Unblock the Notifications








