ఫోర్డ్ ఈకోస్పోర్ట్ డీజిల్ వేరియంట్స్ రీకాల్
అత్యంత సరమైన ధరకే మార్కెట్లో విడుదలై హల్ చల్ సృష్టించిన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ డీజిల్ వేరియంట్లో ఓ చిన్న సమస్య కారణంగా వీటిని రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మార్కెట్లోకి విడుదలై రెండు వారాలు కూడా పూర్తి కాకముందే ఇలా రీకాల్ చేయటం గమనార్హం.
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ డీజిల్ వేరియంట్లలో గ్లో పగ్ మాడ్యూల్ (glow plug module) సమస్య కారణంగా వీటిని రీకాల్ చేస్తున్న ఫోర్డ్ ఇండియా పేర్కొంది. రోటీన్ చెక్‌లలో భాగంగా ఈకోస్పోర్ట్ డీజిల్ వేరియంట్లలో గ్లోబ్ మాడ్యూల్‌కు సంబంధించిన సమస్యలను గుర్తించామని, ఈ మాడ్యూల్‌ను రీలొకేట్ చేయాల్సిన అవసరం ఉందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా.. ఈ సమస్యకు సంబంధించి కస్టమర్లను సంప్రదిస్తున్నామని, వారు తమ డీజిల్ వేరియంట్ ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీలను అధీకృత ఫోర్డ్ డీలర్‌షిప్‌ల వద్దకు తీసుకువచ్చినట్లయితే, దీనిని ఉచితంగా సరిచేస్తామని కూడా కంపెనీ తెలిపింది.
అస్సలు గ్లో ప్లగ్ మాడ్యూల్ అంటే ఏమిటి? అదెలా పనిచేస్తుంది..?
డీజిల్ ఇంజన్లకు గ్లో ప్లగ్ మాడ్యూల్ అత్యంత ముఖ్యమైన విడిభాగం. ఈ గ్లో పగ్‌కు పైభాగంలో హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది. కీ ద్వారా ఇంజన్‌కు ఇగ్నిషన్‌ను అందించినప్పుడు, ఆ హీటింగ్ ఎలిమెంట్ దాని ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ద్వారా ఉత్తేజమై విజిబల్ స్పెక్ట్రమ్ లోనికి కాంతిని ప్రవేశింపజేస్తుంది. అందుకే దీనిని గ్లో ప్లగ్ అంటారు. ఇలా ఉత్పత్తి అయిన ఉష్ణాన్ని ఇంజన్‌లోనికి ప్రసరింపజేసి సిలిండర్ల చుట్టూ తక్షణమే వేడి అయ్యేలా చేస్తుంది.

ఇంజన్స్:
1.5 లీటర్ పెట్రోల్: 110 హార్స్ పవర్, 140 ఎన్ టార్క్
1.5 లీటర్ డీజిల్: 90 హార్స్ పవర్, 204 ఎన్ టార్క్
1.0 లీటర్ ఈకోబూస్ట్ పెట్రోల్: 123 హార్స్ పవర్, 170 ఎన్ టార్క్

ట్రాన్సిమిషన్:
5-స్పీడ్ మ్యాన్యువల్
6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను కేవలం 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు.

మైలేజ్:
1.5 లీటర్ పెట్రోల్: 15.6 కెఎమ్‌పిల్
1.5 లీటర్ డీజిల్: 22.7 కెఎమ్‌పిల్
1.0 లీటర్ ఈకోబూస్ట్: 18.9 కెఎమ్‌పిల్

కలర్ ఆప్షన్స్:
మార్స్ రెడ్
కైనెటిక్ బ్లూ
సీ గ్రే
మాన్‌డస్ట్ సిల్వర్
పాంథర్ బ్లాక్
డైమండ్ వైట్
చిల్

వేరియంట్లు, ధరలు (జూన్ 2013 నాటికి):
1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్ ధరలు (మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్):
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి ఆంబీంటే - రూ.5.59 లక్షలు
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి ట్రెండ్ - రూ.6.49 లక్షలు
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి టైటానియం - రూ.7.51 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

వేరియంట్లు, ధరలు (జూన్ 2013 నాటికి):
1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్ ధరలు (ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్):
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఏటి టైటానియం - రూ.8.45 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

వేరియంట్లు, ధరలు (జూన్ 2013 నాటికి):
1.0 లీటర్ పెట్రోల్ వెర్షన్ ధరలు (మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్):
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.0 ఎమ్‌టి టైటానియం - రూ.7.89 లక్షలు
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.0 ఎమ్‌టి టైటానియం (ఆప్షనల్) - రూ.8.29 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

వేరియంట్లు, ధరలు (జూన్ 2013 నాటికి):
1.5 లీటర్ డీజిల్ వెర్షన్ ధరలు (మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్):
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి ఆంబీంటే - రూ.6.69 లక్షలు
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి ట్రెండ్ - రూ.7.61 లక్షలు
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి టైటానియం - రూ.8.62 లక్షలు
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి టైటానియం (ఆప్షనల్) - రూ.8.99 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

హైదరాబాద్‌లో ధరలు
1.5పె ఆంబీంటే: రూ.568,937
1.5పె ట్రెండ్: రూ.661,545
1.5పె టైటానియం ఎమ్‌టి: రూ.764,340
1.5పె టైటానియం ఏటి: రూ.860,012
1.0లీ ఈకోబూస్ట్ టైటానియం: రూ.804,034
1.0లీ ఈకోబూస్ట్ టైటానియం ప్లస్: రూ.843,728
1.5డీ ఆంబీంటే: రూ.680,893
1.5డీ ట్రెండ్: రూ.774,518
1.5డీ టైటానియం: రూ.877,314
1.5డీ టైటానియం ప్లస్: రూ.815,989
(పె- పెట్రోల్, డీ- డీజిల్, ఎమ్‌టి - మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, ఏటి - ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్)


Click it and Unblock the Notifications








