2014 చివర్లో ఫోర్డ్ ఫిగో ఫేస్‌లిఫ్ట్ విడుదల!

By Ravi

అమెరికాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ ఇండియా 2010లో తమ ఫిగో హ్యాచ్‌బ్యాక్‌ను ఇండియాకు పరిచయం చేసింది. ఆ తర్వాత అక్టోబర్ 2012లో కంపెనీ ఇందులో ఓ అప్‌డేటెడ్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. కాగా.. కంపెనీ ఇప్పుడు ఓ సరికొత్త ఫోర్డ్ ఫిగో ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ఫోర్డ్ ఇండియా తమ కొత్త ఫిగో కాన్సెప్ట్ కారును ప్రదర్శించిన సంగతి తెలిసినదే. ఈ మోడల్‌కు మంచి స్పందన కూడా లభించింది. అయితే, దీనిని హ్యాచ్‌బ్యాక్ రూపంలో కాకుండా కాంపాక్ట్ సెడాన్ రూపంలో కంపెనీ ప్రదర్శించింది. ఏదేమైనప్పటికీ, ఇదే ప్లాట్‌‍ఫామ్‌పై ఫిగో పేరుతో రెండు వాహనాలు రానున్నట్లు సమాచారం.


అందులో ఒకటి 2014 ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్ మరొకటి ఫోర్డ్ ఫిగో కాంపాక్ట్ సెడాన్. ఈ రెండు మోడళ్లలో ముందుగా అప్‌డేటెడ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లోకి రానుంది. కొత్త వెర్షన్ ఫోర్డ్ ఫిగోలో డిజైన్‌తో పాటుగా ఇంజన్‌లో కూడా మార్పులు చేర్పులు ఉండనున్నాయి.

ఇందులో కొత్తగా అభివృద్ధి చేసిన 1.0 లీటర్ ఈకోనెటిక్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్‌‍లో డ్యూయెల్ కమాండ్‌ను ఉపయోగించుకునే టిఐ విసిటి (ట్విన్ ఇండిపెండెంట్ వేరియబల్ కామ్‌షఫ్ట్ టైమింగ్) సిస్టమ్‌ను అమర్చనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 85 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుందని అంచనా.

Ford Ka

ఇందులో డీజిల్ వెర్షన్ (1.5 లీటర్)ను కూడా కంపెనీ ఆఫర్ చేయనుంది. ఎక్స్టీరియర్ నుంచి ఇంటీరియర్ వరకు కొత్త ఫిగోలో అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి. ఇది మరింత మోడ్రన్‌గా, ప్రీమియంగా కనిపించనుంది. ఈ మార్పుల వలన ఇది ప్రస్తుత తరం ఫిగో కన్నా కాస్తంత ఎక్కువ ధరను కలిగి ఉండే అవకాశాలున్నాయి.

ఈ ఏడాది చివరి నాటికి సరికొత్త ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఫోర్డ్ ఫిగోతో పాటుగా కంపెనీ తమ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కూడా త్వరలోనే అప్‌గ్రేడ్ చేయనున్నట్లు సమాచారం. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, May 21, 2014, 12:10 [IST]
English summary
Ford got their first Figo hatchback to India in 2010. The car has been manufactured at their Chennai plant and has been the best seller for the American brand. At the 2014 Auto Expo held in New Delhi, Ford revealed their new Figo concept to all and stunned everyone.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+