నెక్స్ట్ జనరేషన్ ఫోర్డ్ ఎండీవర్ ఆవిష్కరణ; 2015లో విడుదల
అమెరికాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ మోటార్స్ అందిస్తున్న పవర్‌ఫుల్ అండ్ పాపులర్ ఎస్‌యూవీ 'ఎండీవర్'లో కంపెనీ ఓ సరికొత్త తరం (నెక్స్ట్ జనరేషన్) మోడల్‌ను ఆవిష్కరించింది. ఈ సరికొత్త 2015 ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ వచ్చే ఏడాది భారత మార్కెట్లో విడుదల కానుంది. ఈ మోడల్‌ను భారత్‌లోనే కాకుండా ఆస్ట్రేలియా, చైనా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా మార్కెట్లలో కూడా విక్రయించనున్నారు.
ఫోర్డ్‌కి చెందిన ఆస్ట్రేలియా విభాగం, ఫోర్డ్ ఆస్ట్రేలియా గడచిన సంవత్సరం ఆగస్ట్ నెలలో ఆవిష్కరించిన 'ఫోర్డ్ ఎవరెస్ట్' ఎస్‌యూవీ కాన్సెప్ట్ నుంచి స్ఫూర్తి పొంది ఈ నెక్స్ట్ జనరేషన్ ఫోర్డ్ ఎండీవర్‌ను తయారు చేశారు. కొన్ని మార్కెట్లలో ఈ మోడల్‌ని ఎవరెస్ట్ పేరుతో విక్రయించనున్నారు. అయితే, ఇండియా మార్కెట్లో మాత్రం దీనిని ఎండీవర్ పేరుతోనే విక్రయించనున్నారు.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మాదిరిగా పెద్ద ట్రాపేజోయ్‌డల్ గ్రిల్, క్రోమ్ సైడ్ మిర్రర్స్, పెద్ద వీల్ ఆర్చెస్ వంటి ఎక్స్టీరియర్ మార్పులతో పాటుగా ఇంటీరియర్లలో కూడా అనేక అప్‌గ్రేడ్స్ ఈ కొత్త ఎండీవర్ ఎస్‌యూవీలో ఉండనున్నాయి.

సెవన్ సీటర్ లేఅవుట్ కోసం అదే బాడీ-ఆన్-ఫ్రేమ్‌ను ఉపయోగించాలని ఫోర్డ్ భావిస్తోంది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌లో చూసినట్లుగా 4-స్పోక్ స్టీరింగ్ వీల్, ఫోర్డ్ సింక్ సిస్టమ్‌లను కూడా కొత్త 2015 ఫోర్డ ఎండీవర్‌లో పరిచయం చేసే అవకాశం ఉంది.

నెక్స్ట్ జనరేషన్ ఫోర్డ్ ఎండీవర్‌లో 2.2 లీటర్ మరియు 3.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్లను ఉపయోగించనున్నారు. అలాగే ఇందులో 2.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్‌ను కూడా ఫోర్డ్ పరిచయం చేసే ఆస్కారం ఉంది (అయితే, ఈకోబూస్ట్ ఇంజన్ ఇప్పట్లో ఇండియన్ మార్కెట్లో విడుదల కాకపోవచ్చు). ఇది టూ-వీల్ డ్రైవ్ (4x2), ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్లతో, మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

ఫోర్డ్ ఇండియా ఈ ఏడాది ఏప్రిల్ (2014) నెలలో రిఫ్రెష్డ్ ఎండీవర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం దేశీయ విపణిలో లభిస్తున్న ఫోర్డ్ ఎండీవర్ మొత్తం మూడు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. బేస్ వేరియంట్లో 2.5 లీటర్ టిడిసిఐ డ్యురాటార్క్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది టూవీల్ డ్రైవ్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో లభిస్తుంది.

రెండవ ఇంజన్ ఆప్షన్ (మిడ్-వేరియంట్) విషయానికి వస్తే.. ఇందులో 3.0 లీటర్ డిటిసిఐ డ్యురాటార్క్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది టూవీల్ డ్రైవ్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో లభ్యం కానుంది. ఇకపోతే మూడవ ఆప్షన్ (టాప్-ఎండ్ వేరియంట్)లో కూడా ఇదే 3.0 లీటర్ ఇంజన్ ఉపయోగించారు. కాకపోతే ఇది ఫోర్-వీల్ డ్రైవ్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభ్యమవుతుంది.

కాగా.. కొత్తగా రానున్న 2015 ఫోర్డ్ ఎండీవర్ భారత మార్కెట్లోని టొయోటా ఫార్చ్యూనర్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








