యూకే మార్కెట్ కోసం ఫోర్-వీల్ డ్రైవ్ సుజుకి స్విఫ్ట్

By Ravi

భారత్‌లో స్పోర్టీ వెర్షన్ స్విఫ్ట్ కోరుకునే వారి కోసం కంపెనీ స్విఫ్ట్ ఆర్ఎస్ వేరియంట్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. అయితే, పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్ వెర్షన్ స్విఫ్ట్ కోరుకునే వారికి మాత్రం నిరాశే మిగిలింది. ఈ విషయంలో బ్రిటీష్ వాళ్లు చాలా లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే, జపనీస్ కార్ కంపెనీ సుజుకి గ్లోబల్ మార్కెట్లలో అందిస్తున్న స్విఫ్ట్‌లో ఓ ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) వేరియంట్‌ను అక్కడ మార్కెట్లలో విడుదల చేయనుంది.

దీని బేసిక్ డిజైన్ చూడటానికి మన దేశంలో లభిస్తున్న స్విఫ్ట్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఎక్స్టీరియర్ ఇంటీరియర్లలో మాత్రం కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉన్నాయి. గడచిన సంవత్సరం కరెరా, ఇటలీ దేశాల్లో సుజుకి విడుదల చేసిన సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్‌ స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్‌కు మరిన్ని అదనపు స్టయిలింగ్ ఫీచర్లను జోడించి ఈ నెలలోనే యూకే మార్కెట్లో విడుదల చేయనున్నారు.

ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

డిజైన్

డిజైన్

స్పోర్టీ బంపర్స్, బ్లాక్ కలర్ వీల్ ఆర్చెస్, మ్యాట్ బ్లాక్ గ్రిల్, బ్లాక్ అవుట్ పిల్లర్స్, స్కిడ్ ప్లేట్స్, సైడ్ స్కర్ట్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, టర్న్ ఇండికేటర్లతో కూడిన రియర్ వ్యూ మిర్రర్స్ వంటివి ప్రధాన మార్పులను ఈ కొత్త స్విఫ్ట్ 4x4 వేరియంట్‌లో గమనించవచ్చు.

ఇంజన్

ఇంజన్

యూకే వెర్షన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో పవర్‌ఫుల్ 1.2 లీటర్ వివిటి, ఫోర్ సిలిండర్, పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 93 బిహెచ్‌పిల శక్తిని, 118 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్సిమిషన్

ట్రాన్సిమిషన్

ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన ఈ కారులో ఇంజన్ పవర్‌ను నాలుగు చక్రాలకు సమానంగా బదిలీ చేయబడుతుంది. ఈ ఇంజన్‌ను 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది.

సుజుకి స్విఫ్ట్ 4x4 ధరలు:

సుజుకి స్విఫ్ట్ 4x4 ధరలు:

సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్ రెండు వేరియంట్లలో (ఎంట్రీ లెవల్, టాప్ ఎండ్) లభ్యమవుతుంది.

సుజుకి స్విఫ్ట్ 4x4 ఎంట్రీ లెవల్ వేరియంట్ - 11,516 పౌండ్లు

సుజుకి స్విఫ్ట్ 4x4 టాప్ ఎండ్ వేరియంట్ - 13,116 పౌండ్లు

2012 సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్‌

2012 సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్‌

2012 సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్‌

2012 సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్‌

2012 సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్‌

2012 సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్‌

2012 సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్‌

2012 సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్‌

2012 సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్‌

2012 సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్‌

More from DriveSpark

Article Published On: Tuesday, July 9, 2013, 13:57 [IST]
English summary
Japanese carmaker Suzuki Motor Coropration has officially announced plans to offer the Swift 4x4 in the United Kingdom. Suzuki Swift 4x4 hatchback is powered by 1.2 liter VVT petrol four cylinder engine which is capable of producing 93 bhp transmitted to its four wheels through a six speed transmission.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+