గార్మిన్ నుంచి 3 కొత్త శాటిలైట్ నావిగేషన్ పరికరాలు
శాటిలైట్ నావిగేషన్ పరికరాల తయారీలో ప్రపంచపు అగ్రగామి అయిన గార్మిన్, భారత కస్టమర్ల కోసం మూడు కొత్త పరికరాలను మార్కెట్లో విడుదల చేసింది. అవి - నువి 55ఎల్ఎమ్, నువి 65ఎల్ఎమ్, నువి 2567 ఎమ్ఎమ్. ఈ మూడు మోడళ్ల ధరలు వరుసగా రూ.10,990, రూ.14,990, రూ.17,990 లుగా ఉన్నాయి.
ఈ మూడు పరికరాలు కూడా బ్రిలియంట్ డిస్‌ప్లేతో, డివైజ్‌ను నిలువుగా లేదా అడ్డంగా ఉపయోగించుకునేందుకు డ్యూయెల్ స్క్రీన్ ఓరియెంటేషన్‌ను కలిగి ఉంటుంది. వాయిస్ గైడెన్స్ (మాటల రూపంలో దిశానిర్ధేశం చేయటం), ఉచిత మ్యాప్ అప్‌గ్రేడ్స్‌తో ఈ కొత్త గార్మిన్ శాట్-నావ్ పరికరాలు లభిస్తాయి.
అంతేకుండా, మీరు ఏదైనా చారిత్రాత్మక ప్రదేశం లేదా టూరిస్ట్ డెస్టినేషన్‌కు వెళ్లినప్పుడు దానికి సంబంధించిన అదనపు సమాచారాన్ని కూడా ఈ పరికరాలు తెలియజేస్తాయి. వీటికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం రండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో గార్మిన్ విడుదల చేసిన నువి 55ఎల్ఎమ్, నువి 65ఎల్ఎమ్, నువి 2567 ఎమ్ఎమ్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌లకు సంబంధించిన మరింత సమాచారాన్ని పరిశీలించండి.

గార్మిన్ నువి 55ఎల్ఎమ్
నువి 55ఎల్ఎమ్ డివైజ్ 12.7 సెం.మీ. డిస్‌ప్లేని కలిగి ఉండి, ముందున్న జంక్షన్ల గురించి హెచ్చరించే లేన్ అసిస్ట్ ఫీచర్‌తో లభిస్తుంది. బ్రైట్ యారో మార్క్‌తో ఇది మార్గం చూపిస్తుంది. సమీపంలోని రెస్టారెంట్స్, పెట్రోల్ స్టేషన్స్, ఏటిఎమ్‌లు మొదలైన వాటి గురించి తెలియజేసే అప్ హెడ్ ఫీచర్‌తో ఇది లభిస్తుంది.
ధర - రూ.10,990/-

గార్మిన్ నువి 65ఎల్ఎమ్
నువీ 65ఎల్ఎమ్ 15.24 సెం.మీ. స్క్రీన్ డిస్‌ప్లేతో లభిస్తుంది. ఇందులో టైర్ ప్రెజల్ మోనిటరింగ్ సిస్టమ్ (టిపిఎమ్ఎస్) ఫీచర్ ఉంటుంది, ఇది కారు టైర్లలోని గాలి పీడనాన్ని తెలియజేస్తుంది. ఇంకా ఇందులో అప్ హెడ్ ఫీచర్, లేన్ అసిస్ట్, అడ్వాన్స్డ్ హైవే మోడ్, టెక్స్ట్ టూ స్పీచ్, వాయిస్ గైడెన్స్ (ఇంగ్లీష్, హిందీ) మొదలైన ఫీచర్లతో లభిస్తుంది.
ధర - రూ.14,990

గార్మిన్ నువి 2567 ఎల్ఎమ్
నువి సిరీస్ జిపిఎస్ పరికరాల్లో ఇది టాప్ వేరియంట్. ఇందులో పిఓఐ (పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్), అడ్వాన్స్డ్ హైవే మోడ్, లేన్ అసిస్ట్, అప్ హెడ్, న్యాచురల్ గైడెన్స్ మొదలైన ఫీచర్లు లభిస్తాయి. ఇది బ్లూటూత్ కనెక్టివీని కలిగి ఉంటుంది. మీ స్మార్ట్ ఫోన్ సాయంతో దీనిని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని కాల్స్ చేయటమే కాకుండా, వాతావరణం, రియల్ టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్స్ మొదలైనవి పొందవచ్చు.
ధర - రూ.17,990
గార్మిన్ నావిగేషన్ సిస్టమ్ డెమో వీడియోని ఈ స్లైడ్‌లలో వీక్షించండి.


Click it and Unblock the Notifications








