2015 జెనీవా మోటార్ షో: టాటా బోల్ట్ స్పోర్ట్ మోడల్ ఆవిష్కరణ

By Ravi

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, గడచిన సంవత్సరం మార్కెట్లో విడుదల చేసిన 'టాటా బోల్ట్' హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ ఓ పెర్ఫార్మెన్స్ వెర్షన్‌ను 2015 జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించనున్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ ఇప్పుడు 'టాటా బోల్ట్ స్పోర్ట్' (Tata Bolt Sport) పేరిట ఓ పవర్‌ఫుల్ వెర్షన్‌ను జెనీవాలో ప్రదర్శనకు ఉంచింది.

టాటా బోల్ట్ స్పోర్ట్ మోడల్‌లో 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్‌ను గరిష్టంగా 120 బిహెచ్‌పిల శక్తిని, 170 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేశారు. స్టాండర్డ్ టాటా బోల్ట్ కారులోని 1.2 లీటర్, టర్బోచార్జ్డ్, రెవట్రోన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది.

tata bolt at geneva

టాటా బోల్ట్ స్పోర్ట్ మోడల్‌లో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, మూడు విభిన్న డ్రైవింగ్ మోడ్స్ (ఈకో, సిటీ, స్పోర్ట్) ఉంటాయి. ఈ డ్రైవింగ్ మోడ్స్ డ్రైవర్‌కు విభిన్నమైన డ్రైవింగ్ అనుభూతిని ఆఫర్ చేస్తాయి. టాటా బోల్ట్ స్పోర్ట్ వెర్షన్‌లో మెకానికల్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా పలు కాస్మోటిక్ అప్‌‌గ్రేడ్స్ కూడా ఉన్నాయి. దీని ఫ్రంట్ గ్రిల్, బంపర్లను పూర్తిగా రీడిజైన్ చేసి స్పోర్టీ లుక్‌నిచ్చేలా తీర్చిదిద్దారు.

ప్రొజెక్టర్ హెడ్‍‌లైట్స్, రీపొజిషన్డ్ ఫాగ్ ల్యాంప్స్, 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్, వెడల్పాటి రియర్ బంపర్ వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు. ఇంకా ఇందులోని ఇంటీరియర్లను కూడా మరింత ప్రీమియం అండ్ స్పోర్టీ ఫీల్‌నిచ్చేలా డిజైన్ చేశారు. ఇందులో హార్మన్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, టాటా బోల్ట్ స్పోర్ట్ మోడల్ సన్‌రూఫ్ ఫీచర్‌తో కూడా లభిస్తుంది.

tata bolt sport car at geneva motor show

టాటా బోల్ట్ స్పోర్ట్ సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ కారులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, స్పీడ్ సెన్సింగ్ ఆడియో కంట్రోల్స్ వంటి ఫీచర్లున్నాయి. ఈ స్పోర్టీ వెర్షన్ టాటా బోల్ట్ ఈ ఏడాది మధ్య భాగం నాటికి మార్కెట్లోకి రావచ్చని అంచనా. టాటా బోల్ట్ ఒక గ్లోబల్ ప్రోడక్ట్ కాబట్టి, భారత మార్కెట్‌తో పాటు పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఈ స్పోర్ట్ వేరియంట్ విడుదలయ్యే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి..!

More from DriveSpark

Article Published On: Monday, March 9, 2015, 11:19 [IST]
English summary
The 2015 Geneva Motor Show witnessed participation by Indian automobile giant, Tata Motors. It showcased it all-new hatchback the Bolt in a sporty avatar. The Indian manufacturer displayed its Bolt Sport model with significant updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+