జనరల్ మోటార్స్ నుంచి షెవర్లే స్పార్క్ లిమిటెడ్ ఎడిషన్ లాంచ్

జనరల్ మోటార్స్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న షెవర్లే స్పార్క్ హ్యాచ్‌బ్యాక్‌‌లో కంపెనీ ఓ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. రెగ్యులర్ స్పార్క్ హ్యాచ్‌బ్యాక్‌తో పోల్చుకుంటే మరింత స్టయిలిష్‌గా, అదనపు ఫీచర్లతో ఆఫర్ చేయనున్న ఈ లిమిటెడ్ ఎడిషన్ షెవర్లే స్పార్క్ ధరలు రూ.3.44 లక్షల నుంచి రూ.3.99 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

షెవర్లే స్పార్క్ లిమిటెడ్ ఎడిషన్‌లో స్టీరింగ్ వీల్ కవర్, మ్యాచింగ్ నెక్ రెస్ట్స్, యాంబీంట్ ఫుట్-వెల్ లైటింగ్, బీజ్ సీట్ కవర్స్ విత్ రెడ్ స్ట్రైప్స్, ఎక్స్టీరియర్ క్రోమ్ కిట్, కార్పెట్ ఫ్లోర్ మ్యాట్స్, టర్న్ ఇండికేటర్లతో కూడిన అవుట్‌సైడ్ రియర్‌వ్యూ మిర్రర్స్ (ఓఎస్ఆర్‌విఎమ్), సైడ్ బాడీ గ్రాఫిక్స్ (రెండు కలర్ ఛాయిస్), లిమిటెడ్ ఎడిషన్ బ్యాడ్జింగ్ వంటి పలు అదనపు ఫీచర్లు ఇందులో లభిస్తాయి.

GM India Launches Chevrolet Spark Limited Edition

ఈ లిమిటెడ్ ఎడిషన్ స్పార్క్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది, ఇది ఏడు ఆకర్షనీయమైన రంగులలో (సమ్మిట్ వైట్, శాండ్రిఫ్ట్ గ్రే, మిస్టీ లేక్ మెటాలిక్, స్విచ్‌బ్లేడ్ సిల్వర్, వెల్వెట్ రెడ్, లీనెన్ బీజ్, కావియర్ బ్లాక్) లభ్యం కానుంది.

ఇందులో 1.0 లీటర్ స్మార్టెక్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5400 ఆర్‌పిఎమ్ వద్ద 63 పిఎస్‌ల శక్తిని, 4200 ఆర్‌పిఎమ్ వద్ద 90.3 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిటీ రోడ్లు, హైవేలపై డ్రైవింగ్‌కు అనువుగా లోవర్ స్పీడ్స్ వద్ద కూడా పవర్, టార్క్‌లు గరిష్టంగా ఉండేలా ఇంజన్‌ను ట్యూన్ చేశారు.

స్పార్క్ లిమిటెడ్ ఎడిషన్ మూడేళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీతో లభిస్తుంది. అంతేకాకుండా ఈ మోడల్‌పై కంపెనీ మూడేళ్ల పాటు ఉచిత 24/7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ను కూడా ఆఫర్ చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, June 6, 2014, 15:45 [IST]
English summary
General Motors India today announced the launch of the Chevrolet Spark Limited Edition, which is priced ranging from Rs 3.44 to 3.99 lakh (ex-showroom, New Delhi). With an appealing exterior and enriched interior, the newest member of the Spark family provides a superior value proposition in every respect.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+