మూడవ వసంతంలోకి అడుగిడిన 'తెలుగు డ్రైవ్‌స్పార్క్'
మా విలువైన 'తెలుగు వన్ఇండియా' మరియు 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' పాఠకులందరికీ తెలియజేయడమేమనగా.. మీరు ఇంతకాలం ఎంతగానో ఆదిరిస్తూ వచ్చిన మా ఆటోమొబైల్ విభాగం "తెలుగు డ్రైవ్‌స్పార్క్" విజయవంతంగా రెండు వసంతాలను పూర్తి చేసుకుని మూడువ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా, మా తెలుగు డ్రైవ్‌స్పార్క్ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, ఈ వెబ్‌సైట్‌కు ఇంతటి గొప్ప ప్రజాదరణ తెచ్చిపెట్టడంలో సహకరించిన మా పాఠకులందరికీ పేరు పేరునా మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము.
తెలుగు డ్రైవ్‌స్పార్క్‌లో ప్రత్యేకించి ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను ప్రచురించడం జరుగుతుంది. ఆటోమొబైల్ రంగంలో ప్రపంచంలోని నలుమూలల జరిగే ఆటోమొబైల్ వింతలు విశేషాల గురించి సంపూర్ణమైన, విలువైన మరియు విశ్లేషణాత్మకమైన కథనాలను మా పాఠకులకు పరిచయం చేయటం జరుగుతుంది. మా మాతృ వెబ్‌సైట్ 'డ్రైవ్‌స్పార్క్' (www.drivespark.com) భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ఆంగ్లంతో పాటు ఐదు ప్రాంతీయ భాషలలో (తెలుగు, హిందీ/, తమిళం, కన్నడ మరియు మళయాలం) ఆటోమొబైల్ వార్తా విశేషాలను అందిస్తున్న ఏకైక వెబ్‌సైట్.
పాఠకులకు అభిరుచికి అనుగుణంగా తెలుగులో మరెక్కడా లభ్యం కాని విశిష్టమైన కథనాలను, అలాగే రెగ్యులర్ ఆటోమొబైల్ వార్తలను, కొత్త వాహనాల విడుదలకు సంబంధించిన సమాచారాన్ని, వాహనాల ఫీచర్లు మరియు ధరలను, టెస్ట్ డ్రైవ్ సమీక్షలు, ఆటోమొబైల్ చిట్కాలు, ఆటోవిడిభాగాలకు సంబంధించిన సమాచారం, ఆకర్షనీయమైన కార్లు, బైక్‌ల చిత్రాలు మరియు వీడియోలు, సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మకాలు మరియు కొనుగోళ్లు కొత్త కార్లు మరియు బైక్‌ల శోధించాలనుకునే వారి కోసం రీసెర్చ్ టూల్స్ మరియు వాటికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఈ డ్రైవ్‌స్పార్క్ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

ప్రస్తుతం మా "తెలుగు వన్ఇండియా"ను ఆదరిస్తున్నట్లుగానే మా ఈ "తెలుగు డ్రైవ్‌స్పార్క్" వెబ్‌సైట్‌ను కూడా ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాము. తెలుగు డ్రైవ్‌స్పార్క్ వెబ్‌సైట్ గురించి మీ విలువైన ఫీడ్‌బ్యాక్‌ను మాతో పంచుకోగలరు.
ఫీడ్‌బ్యాక్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయగలరు: http://www.oneindia.in/feedback.php
ఈ ఏడాది జనవరి నెలలో మేము డ్రైవ్‌స్పార్క్ వెబ్‌సైట్‌ను రీడిజైన్ చేశాము. సరికొత్త లుక్ అండ్ ఫీల్, ఆకర్షనీయమైన డిజైన్, సులువుగా అర్థం చేసుకునే సెక్షన్స్, మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో మా ఈ వెబ్‌సైట్‌ను మరింత కొత్తగా మెరుగపరచాము.

ఆటోమొబైల్ రంగంలో వార్తలు విశేషాలను మా తెగులు డ్రైవ్‌స్పార్క్ వెబ్‌సైట్‌లోని ఫోర్-వీలర్స్, టూ-వీలర్స్ సెక్షన్లలో చూడొచ్చు.

వాహనాల మెయింటినెన్స్‌కు సంబంధించిన చిట్కాలను, డ్రైవింగ్ చిట్కాలను మరియు ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన చిట్కాలను మా పాఠకుల కోసం ప్రచురించడం జరుగుతుంది.

విశిష్టమైన వాహనాలు, ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన విశిష్టమైన, విచిత్రమైన వార్తలను ఆఫ్ బీట్ సెక్షన్‌లో ప్రచురించడం జరుగుతుంటుంది.

డ్రైవ్‌స్పార్క్ బృందం కొత్త వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేసి, సదరు కార్లకు సంబంధించిన మంచి, చెడులను పాఠకులను తెలియజేసేందుకు సమీక్షలు అనే సెక్షన్‌లో ఈ రిపోర్టులను ప్రచురించబడుతాయి.

కొత్త కార్లకు శోధించాలనుకునే వారి కోసం రీసెర్చ్ టూల్‌ను కూడా తెలుగు డ్రైవ్‌స్పార్క్ అందిస్తోంది.

అలాగే పాత కార్లు కొనాలన్నా లేదా అమ్మాలకునున్న సరే వారి కోసం ప్రత్యేకంగా మేము క్లాసిఫైడ్స్ సెక్షన్‌ను (సెకండ్ హ్యాండ్ కార్లు) కూడా డ్రైవ్‌స్పార్క్ అందిస్తోంది.

గడచిన రెండేళ్ల కాలంగా మా ఈ వెబ్‌సైట్‌ను అభివృద్ధిలోకి తీసుకువచ్చిన మా విలువైన పాఠకులందరికీ ఈ సందర్భంగా మరోసారి మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము.
కేవలం భారతదేశంలోని ఆటోమొబైల్ రంగానికి సంబంధించినవ తాజా సమాచారాన్నే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఆటోమొబైల్ వింతలు, విశేషాల గురించి ఎప్పటికప్పుడు మా విలువైన పాఠకులకు అందించే ఓ చిన్న ప్రయత్నమే మా ఈ "తెలుగు డ్రైవ్‌స్పార్క్ డాట్ కామ్".


Click it and Unblock the Notifications








