ఆగస్ట్ 2013 నెలలో అమ్ముడుపోయిన 'టాప్ 20' కార్లు
ప్రస్తుతం భారత ఆటోమొబైల్ పరిశ్రమకు గడ్డు కాలం నడుస్తోంది. ఎంతకీ దిగిరాని ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు, అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్న ఇంధన ధరలు, అస్థిరమైన స్టాక్ మార్కెట్, రోజురోజుకీ క్షీణిస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తున్న రూపాయి మారకపు విలువ తదితర అంశాలు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి పెను సవాళ్లుగా మారాయి.
వీటికి తోడు కన్జ్యూమర్ సెంటిమెంట్ కూడా బలహీనంగా ఉండటంతో గడచిన ఆగస్ట్ నెలలో కార్ల అమ్మకాలు భారీగా పతనమయ్యాయి. అయితే, ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లోను కొన్నిరకాల మోడళ్లు, తాజాగా మార్కెట్లోకి వచ్చిన కార్ల అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి.
మొత్తమ్మీద చూసుకుంటే ఆగస్ట్ 2013 నెలలో కార్ల అమ్మకాలు మిశ్రమంగా ఉన్నాయి. మరి గడచిన నెలలో అమ్ముడైన టాప్ 20 కార్ మోడళ్ల వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి.

మారుతి సుజుకి ఆల్టో
మారుతి సుజుకి ఎవర్‌గ్రీన్ మోడల్ ఆల్టో ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉంది. ఆగస్ట్ 2013 నెలలో మొత్తం 17,124 ఆల్టో కార్లు అమ్ముడుపోయాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్
ఆగస్ట్ 2013 నెలలో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలు స్వల్పం జోరందుకున్నాయి. గడచిన నెలలో నాల్గన స్థానంలో ఉన్న స్విఫ్ట్ ఇప్పుడు 14,152 యూనిట్ల అమ్మకాలతో తిరిగి ద్వితీయ స్థానానికి చేరుకుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్
ఆగస్ట్ 2013 నెలలో మొత్తం 13,723 యూనిట్ల స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ అమ్మకాలతో ఇది తృతీయ స్థానంలో నిలిచింది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్
ఈ టాప్ 20 కార్ల జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్న మోడల్ కూడా మారుతి సుజుకికి చెందినదే. ఆగస్ట్ 2013 నెలలో కంపెనీ అందిస్తున్న బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ 12,784 యూనిట్లు అమ్ముడుపోయాయి.

హ్యుందాయ్ ఇయాన్
ఈ జాబితాలో ఐదవ స్థానంలో హ్యుందాయ్ ఇయాన్ ఉంది. గడచిన నెలలో మొత్తం 7991 హ్యుందాయ్ ఇయాన్ కార్లు అమ్ముడుపోయాయి.

మహీంద్రా బొలెరో
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న చీప్ అండ్ బెస్ట్ ఎస్‌యూవీ బొలెరో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. ఈ జాబితాలో 6వ స్థానంలో నిలిచిన మహీంద్రా బొలెరో గడచిన నెలలో 7030 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

హోండా అమేజ్
గడచిన జులై నెలలో 8వ స్థానంలో ఉన్న హోండా అమేజ్ సెడాన్ ఆగస్ట్ 2013 నెలలో 6242 యూనిట్ల అమ్మకాలతో 7వ స్థానానికి చేరుకుంది.

హ్యుందాయ్ ఐ10
భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తున్న హ్యాచ్‌బ్యాక్ ఐ10 గడచిన ఆగస్ట్ 2013 నెలలో మొత్తం 6017 యూనిట్ల అమ్మకాలను తన ఖాతాలో వేసుకుంది.

హ్యుందాయ్ ఐ20
హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ హ్యుందాయ్ ఐ20 గడచిన నెలలో 5695యూనిట్లు అమ్ముడుపోయాయి.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్
టాప్ 20 కార్ల జాబితాలో తాజాగా వచ్చిన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 10వ స్థానంలో నిలిచింది. ఆగస్ట్ 2013లో మొత్తం 5372 యూనిట్ల ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీలు అమ్ముడుపోయాయి.

టొయోటా ఇన్నోవా
జపనీస్ కార్ కంపెనీ టొయోటా అందిస్తున్న బెస్ట్ ఎమ్‌పివి ఇన్నోవా సేల్స్ కూడా తగ్గాయి. ఎమ్‌పివి సెగ్మెంట్లో పోటీ పెరగడంతో ఈ మోడల్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆగస్ట్ 2013 నెలలో 5075 యూనిట్ల ఇన్నోవాలు అమ్ముడయ్యాయి.

మారుతి సుజుకి ఓమ్నీ
గడచిన నెలలో 4860 మారుతి సుజుకి ఓమ్నీలు సేల్ అయ్యాయి.

మారుతి సుజుకి ఎర్టిగా
మారుతి సుజుకి అందిస్తున్న ఎర్టిగా ఎమ్‌పివి అమ్మకాలు క్రమంగా తగ్గతూ వస్తున్నాయి. గడచిన నెలలో కేవలం 4,563 ఎర్టిగా ఎమ్‌పివిలు మాత్రమే అమ్ముడయ్యాయి.

టాటా ఇండికా ఫ్యామిలీ
గడచిన నెలలో దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న ఇండికా రేంజ్ కార్లు అన్నీ కలిపి 4,260 యూనిట్లుగా నమోదయ్యాయి.

హ్యుందాయ్ వెర్నా
ఆగస్ట్ 2013లో హ్యుందాయ్ అందిస్తున్న సి సెగ్మెంట్ సెడాన్ వెర్నా అమ్మకాలు 3882 యూనిట్లుగా నమోదయ్యాయి.

మహీంద్రా స్కార్పియో
మహీంద్రా అందిస్తున్న బెస్ట్ ఆఫ్ రోడింగ్ ఎస్‌యూవీ స్కార్పియో అమ్మకాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గడచిన ఆగస్ట్ 2013 నెలలో మొత్తం 3356 స్కార్పియోలు అమ్ముడయ్యాయి.

మారుతి ఈకో
గడచిన నెలలో 3096 మారుతి సుజుకి ఈకోలు సేల్ అయ్యాయి.

రెనో డస్టర్
పోర్డ్ ఈకోస్పోర్ట్ రాకతో ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా అందిస్తున్న డస్టర్ ఎస్‌యూవీ జోరు భారీగాతగ్గిందనే చెప్పాలి. గడచిన నెలలో కేవలం 3967 రెనో డస్టర్ ఎస్‌యూవీలు మాత్రమే అమ్ముడుపోయాయి.

చెవర్లే బీట్
జనరల్ మోటార్స్ అందిస్తున్న చిన్న కారు చెవర్లే బీట్ అమ్మకాలు కూడా ఆశాజనకంగా లేవు. గడచిన ఆగస్ట్ 2013 నెలలో మొత్తం 2,926 బీట్ కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి.

ఫోక్స్‌వ్యాగన్ పోలో
క్రాస్ పోలో విడుదలతో పోలో అమ్మకాలు తగ్గినట్లు తెలుస్తోంది. గడచిన ఆగస్ట్ 2013 నెలలో మొత్తం 2908 ఫోక్స్‌వ్యాగన్ పోలో కార్లు అమ్ముడుపోయాయి.


Click it and Unblock the Notifications








