కొత్త అంబాసిడర్ ఎన్‌కోర్ ధర వెల్లడించిన హిందుస్థాన్ మోటార్స్

By Ravi

కొత్త అంబాసిడర్ విడుదలకు సంబంధించి తెలుగు డ్రైవ్‌స్పార్క్ గతంలో విభిన్న కథనాలు ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజాగా, సికె బిర్లా గ్రూపు చెందిన హిందుస్థాన్ మోటార్స్ ఆదివారం నాడు (సెప్టెంబర్ 1, 2013) తమ సరికొత్త బిఎస్-4 డీజిల్ ఇంజన్ కలిగిన అంబాసిడ్ కారును మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారులో ఇంజన్‌తో పాటు దీని పేరును కూడా 'అంబాసిడర్ ఎన్‌కోర్' (Ambassador Encore)గా మార్చారు.

'నో-రిఫ్యూజల్' (తిరస్కరణ లేని) టాక్సీ సెగ్మెంట్లో అత్యంత సరసమైన ధరకే ఈ కొత్త అంబాసిడర్ ఎన్‌కోర్ కారును ప్రవేశపెట్టారు. దేశీయ విపణిలో ఈ కారు ధర రూ.4.97 లక్షలు (ఎక్స్-షోరూమ్, కలకత్తా)గా నిర్ణయించామని, నేటి నుంచి ఈ మోడల్‌కు బుకింగ్‌లను స్వీకరిస్తామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. రీప్లేస్‌మెంట్ టాక్సీ సెగ్మెంట్లోని కొనుగోలుదారులు ఈ ప్రకటించిన ధరలో మంచి తగ్గింపును కూడా పొందవచ్చని హిందుస్థాన్ మోటార్స్ తెలిపింది.

New Ambassador Encore

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇటీవలే నో-రిఫ్యూజల్ టాక్సీ సెగ్మెంట్ కోసం 2,000 పర్మిట్లను జారీ చేసింది. నంవబర్ నెలలో ఇలాంటివే మరో 2,000 పర్మిట్లు విడుదల కావచ్చని అంచనా. ఈ కొత్త అంబాసిడర్ ఎన్‌కోర్ విడుదలతో అమ్మకాలు పెరగవచ్చని కంపెనీ ఆశిస్తోంది. ప్రయాణికులు టాక్సీని తిరస్కరించకుండా ఉండేలా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఓ కాన్సెప్ట్‌ను తీసుకువచ్చింది.

ఇందులో భాగంగానే, ఈ కొత్త టాక్సీలు సన్నగా ఉండి, ప్యాసింజర్లకు అధనపు సౌకర్యాలను అందిస్తాయి. అంతేకాకుండా, ఈ క్యాబ్‌లపై నో రిఫ్యూజల్ అని కూడా ప్రింట్ చేసి ఉంటుంది. హిందుస్థాన్ మోటార్స్ నుంచి ఇదొక గేమ్ ఛేంజింగ్ ఆఫర్ అని, వినియోగదారుల అవసరాలు, కొనుగోలు శక్తికి అధిక ప్రాధాన్యత ఇచ్చేదని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఉత్తమ్ బోస్ ఆ ప్రకటనలో తెలిపారు.

More from DriveSpark

Article Published On: Monday, September 2, 2013, 8:44 [IST]
English summary
Hindustan Motors has announced the price of its newly introduced BS IV compliant diesel Ambassador at Rs 4,97,996 (ex-showroom Kolkata) under the 'no-refusal' taxi segment. Bookings for the vehicle named Ambassador Encore will begin from tomorrow, the company said in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+