2,500 పాజెరోలు విక్రయిస్తాం: హిందుస్థాన్ మోటార్స్
సికె బిర్లా గ్రూపుకు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ హిందుస్థాన్ మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2,500 యూనిట్ల లేటెస్ట్ మిత్సుబిషి పాజెరో ప్రీమియం ఎస్‌యూవీలను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ ఉన్నతాధి ఒకరు వెల్లడించారు.
గడచిన ఆర్థిక సంవత్సరంలో 1,800 యూనిట్ల పాజెరోలను విక్రయించామని, ఈ ఏడాది 2,500 యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హిందుస్థాన్ మోటార్స్ హెడ్ (సేల్స్ అండ్ ఛానెల్ ఎక్స్‌పాన్సన్) ఆశిష్ కౌల్ తెలిపారు. పాజెరో స్పోర్ట్ ప్రీమయం ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసినప్పటి నుంచి (2002 నుంచి) ఇప్పటి వరకు సుమారు 60,000 యూనిట్లను విక్రయించామని ఆయన తెలిపారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో పాజెరోలో కొత్త వేరియంట్లను అలాగే డీజిల్ ఆధారిత 'అవుట్‌లాండర్', 'మోంటెరో'లలో కొత్త వెర్షన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నామని కూడా ఆయన చెప్పారు. ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్లో పాజెరో ప్రస్తుతం ద్వితీయ స్థానంలో ఉందని (ప్రథమ స్థానంలో టొయోటా ఫార్చ్యూనర్ ఉంది) కౌల్ తెలిపారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు పాజెరో స్పోర్ట్‌పై తొలిసారిగా ప్రత్యేక ఫైనాన్స్ సదుపాయాన్ని కూడా అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.

డాలరుతో పోల్చుకుంటే రూపాయి పతనం కంపెనీపై తీవ్ర ప్రభావం చూపిందని, ఫలితంగా సెప్టెంబర్ నెలలో పాజెర్ ధర పెరిగే ఆస్కారం ఉందని ఆయన వివరించారు. పాజెరో స్పోర్ట్‌లో కంపెనీ వార్షికోత్సవ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ వార్షికోత్సవ ఎడిషన్ మిత్సుబిషి పాజెరో స్పోర్ట్‌లో నావిగేషన్ సిస్టమ్, బాడీ కలర్డ్ బంపర్స్, ఆడియో సిస్టమ్, రియర్ వ్యూ కెమెరా వంటి అధనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి.


Click it and Unblock the Notifications








