ఆటో ఎక్స్‌పో 2014: హోండా అకార్డ్ హైబ్రిడ్ ఆవిష్కరణ
హోండాకు గ్లోబల్ మార్కెట్లలో అత్యంత పాపులర్ మోడల్ అయిన 'అకార్డ్ హైబ్రిడ్' వెర్షన్‌ను కంపెనీ ఇటీవలే ముగిసిన 2014 ఆటో ఎక్స్‌పోను వేదికగా చేసుకొని, భారతీయులకు పరిచయం చేసింది. ప్రస్తుతం భారత్‌లో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి సరైన మౌలిక సదుపాయాలు లేకపోవటంతో ఎలక్ట్రిక్ కార్లు కేవలం కొన్ని నగరాలకు మాత్రమే పరిమితమైపోతున్నాయి.
ఇలాంటి ఎలక్ట్రిక్ వాహనాలకు చక్కటి ప్రత్యామ్నాయమే ఈ హైబ్రిడ్ వాహనాలు. హైబ్రిడ్ వాహనాలు పెట్రోల్ లేదా డీజిల్ ఇంజన్లతో పాటు బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉంటాయి. ఈ వాహనాల విషయంలో బ్యాటరీ పవర్ ఖాలీ అయితే, పెట్రోల్/డీజిల్ ఇంజన్‌తో వాహనాన్ని నడుపుకోవచ్చు. అలాగే పెట్రోల్/డీజిల్ ఖాలీ అయితే బ్యాటరీ పవర్‌తో కారును నడుపుకోవచ్చు.

లేదా రెండింటిని (పెట్రోల్/డీజిల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్) ఉపయోగిస్తూ ప్రయాణించి, ఎక్కువ మైలేజ్ పొందవచ్చు. ఇక హోండా అకార్డ్ హైబ్రిడ్ విషయానికి వస్తే, ఇది పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా బ్యాటరీ పవర్‌తో నడిచే ఎలక్ట్రిక్ మోటార్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 141 పిఎస్‌ల శక్తిని, 165 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
హోండా అకార్డ్ హైబ్రిడ్‌లోని ఎలక్ట్రిక్ మోటార్ లిథియం అయాన్ బ్యాటరీల సాయంతో నడుస్తుంది. ఈ రెండు ఇంజన్లు ఈ-సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కు అనుసంధానం చేయబడి ఉంటాయి. ఇది ఈ సెగ్మెంట్లో నేరుగా టొయోటా క్యామ్రీ వంటి హైబ్రిడ్ కార్లతో పోటీ పడుతుంది.


Click it and Unblock the Notifications








