ఏప్రిల్ 11న హోండా అమేజ్ విడుదల; బుకింగ్స్‌ను ప్రారంభం

By Ravi

మీరు కూడా హోండా డీజిల్ కారు కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే, మీ ఎదురు చూపులు అతిత్వరలోనే ఫలించనున్నాయి. హోండా కార్స్ ఇండియా తమ మొట్టమొదటి డీజిల్ కారు 'అమేజ్'ను ఈనెల 11న మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గోవాలో జరిగిన ఓ మీడియా కార్యక్రమంలో హోండా తమ అమేజ్ సెడాన్‌ను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా కంపెనీ అధికారులు మాట్లాడుతూ.. ఈ మోడల్ కోసం బుకింగ్‌లను ప్రారంభించామని పేర్కొన్నారు. ధర, ఇతర విషయాలను విడుదల రోజునే వెల్లడిస్తామని వారు తెలిపారు.

ఇది హోండా నుంచి వస్తున్న మొట్టమొదటి డీజిల్ కారు కావటంతో, ఈ మోడల్‌పై ఇప్పటికే మంచి క్రేజ్ నెలకొని ఉంది. ఎర్త్ డ్రీమ్స్ సంస్థతో కలిసి హోండా అభివృద్ధి చేసిన 1.5 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్‌ను ఈ కారులో ఉపయోగించారు. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది గరిష్టంగా లీటరు డీజిల్‌కు 25.8 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. అంటే, భారతదేశంలోనే అత్యధిక మైలేజీనిచ్చే కారుగా హోండా అమేజ్ నిలువనుంది. ఇది డీజిల్‌ ఇంజన్‌తో పాటుగా పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభ్యమవుతుంది.

పెట్రోల్ వెర్షన్‌లో 1.2 లీటర్, 4-సిలిండర్, 16-వాల్వ్ పెట్రలో ఇంజన్‌ను అమర్చారు. ఇది ఇది గరిష్టంగా 90 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది, ఇందులో మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో పాటుగా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ ఆప్షన్ కూడా లభ్యమయ్యే అవకాశం ఉంది. హోండా కార్స్ ఇందిస్తున్న బ్రయో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అమేజ్ సెడాన్‌ను అభివృద్ధి చేసి విషయం తెలిసినదే. మార్కెట్ సమాచారం ప్రకారం, పెట్రోల్ ధర రూ.5 లక్షల నుంచి, డీజిల్ వెర్షన్ ధర రూ.6 లక్షల నుంచి ప్రారంభం కావచ్చని అంచనా.

టాప్ ఎండ్ వేరియంట్ హోండా అమేజ్‌ (విఎక్స్ వేరియంట్)లో టర్న్ ఇండికేటర్లతో కూడిన ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్, యూఎస్‌బి, ఆక్స్-ఇన్, ఎఫ్ఎమ్ సపోర్ట్‌తో కూడిన ఆడియో సిస్టమ్ (బ్లూటూత్, సిడి సపోర్ట్ లేదు), స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్, మ్యాన్యువల్ ఏసి (ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లేదు), డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, 8-స్పోక్ 14 ఇంచ్ అల్లాయ్ వీల్స్, అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, రియర్ డిఫాగ్గర్, కప్‌ హోల్డర్లు కలిగిన రియర్ సీట్ ఆర్మ్‌ రెస్ట్, ఫాగ్ ల్యాంప్స్, రిమోట్ సెంట్రల్ లాకింగ్ (ఇంటర్నల్ బూట్ రిలీస్ మాత్రమే) వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

More from DriveSpark

Article Published On: Monday, April 1, 2013, 13:10 [IST]
English summary
Honda Motors India is set to launch the Amaze compact in India on April 11, 2013. Based on the Brio compact hatchback, the Amaze is Honda's first diesel car in India, which boasts of an impressive ARAI certified mileage of 25.8 kmpl, the highest of any Indian four wheeler.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+