హైదరాబాద్ మార్కెట్లో అమేజ్ సెడాన్‌ను విడుదల చేసిన హోండా

హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. మీరు కూడా హోండా అమేజ్ సెడాన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే, ఇప్పుడు మీ ఎదురు చూపులు ఫలించనున్నాయి. జపనీస్ కార్ కంపెనీ హోండా కార్స్ ఇండియా తాజాగా దేశీయ విపణిలో విడుదల చేసిన కాంపాక్ట్ ఫ్యామలీ సెడాన్ 'హోండా అమేజ్‌‌' ఇప్పుడు మన రాష్ట్ర మార్కెట్లో కూడా లభ్యం కానుంది. శుక్రవారం రోజున హోండా తమ అమేజ్ సెడాన్‌ను ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో విడుదల చేసింది. హైదరాబాద్ మార్కెట్లో హోండా అమేజ్ ప్రారంభ ధర రూ.5.08 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

హోండా కార్స్ ఇండియా మొత్తం అమ్మకాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 10 శాతం మార్కెట్ వాటా ఉందని, గడచిన సంవత్సరంలో ఇక్కడి మార్కెట్లో 3,500 కార్లను విక్రయించామని, ఈ ఏడాది డీజిల్ వెర్షన్‌ను విడుదల చేసిన నేపథ్యంలో ఈ అమ్మకాల సంఖ్య రెట్టింపు కాగలదని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ ధీమా వ్యక్తం చేశారు. వడ్డీరేట్లు, చమురు ధరలు దిగివస్తుండటంతో రానున్న కాలంలో కార్ల అమ్మకాలు పెరగవచ్చని అంచనా వేస్తున్నామని ఆయన అన్నారు.

రాజస్థాన్‌లో రూ.2,500 కోట్లతో ఏర్పాటు చేస్తున్న 1.20 లక్షల వార్షిక సామర్థ్యం కలిగిన యూనిట్ వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుందని, దీంతో మొత్తం ఇండియాలో హోండా ఉత్పత్తి సామర్థ్యం సాలీనా 2.40 లక్షల యూనిట్లకు చేరుకుంటుందని సేన్ వివరించారు. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న హోండా కార్లలో డీజిల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టే యోచన లేదని, అయితే తాము కొత్తగా మార్కెట్లో విడుదల చేయబోయే మోడళ్లలో మాత్రం డీజిల్ వెర్షన్లను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన అన్నారు.

హోండా అమేజ్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్ సెడాన్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మొత్తం 10 వేరియంట్లలో (6 పెట్రోల్, 4 డీజిల్) లబిస్తుంది. హోండాకు అమేజ్ మొట్టమొదటి డీజిల్ కారు. భారత్‌లో లభిస్తున్న డీజిల్ కార్లలో కెల్లా అత్యధిక మైలేజీనిచ్చే కారు కూడా అమేజ్ కావటం విశేషం.

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్‌ను థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఉన్న ఆసియా పసిఫిక్ కంపెనీ లిమిటెడ్ ఆర్ అండ్ డి కేంద్రంలో అభివృద్ధి చేశారు.

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్ పెట్రోల్ వేరియంట్‌లో 1.2 లీటర్ ఐ-విటెక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 88 పిఎస్‌ల శక్తిని, 109 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కలిగిన వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, మ్యాన్యూవల్ వేరియంట్ లీటరుకు 18 కిలోమీటర్ల మైలేజీని, ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 15.5 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్ డీజిల్ వేరియంట్‌లో 1.5 లీటర్ ఐ-డిటెక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 100 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 25.8 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ తెలిపింది.

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్ సెడాన్ ఆరు ఆకర్షనీయమైన రంగులలో (మెజిస్టిక్ బ్లూ మెటాలిక్, కార్నెలియన్ రెడ్ పెరల్, అర్బన్ టైటానియం మెటాలిక్, అల్బాస్టర్ సిల్వర్ మెటాలిక్, క్రిస్టల్ బ్లాక్ పెరల్ మరియు టఫేటా వైట్) లభిస్తుంది.

హోండా అమేజ్

హోండా అమేజ్

అమేజ్ సెడాన్‌లో డ్యూయెల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ప్రీటెన్షనర్ సీట్ బెల్ట్స్, ధృఢమైన బాడీ నిర్మాణం వంటి సేఫ్టీ ఫీచర్లున్నాయి. అన్ని డీజిల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్లలో ఈబిడితో కూడిన ఏబిఎస్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా అందిస్తున్నారు.

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్ కోసం ప్రత్యేకంగా ఓ 'హోండా కేర్ మెయింటినెన్స్ ప్యాకేజ్'ను ఆఫర్ చేస్తున్నామని, ఈ ప్యాకేజ్‌ను పెట్రోల్ వేరియంట్‌కు రూ.9,996 మరియు డీజిల్ వేరియంట్‌కు రూ.15,375 లకే అందిస్తున్నామని ఇది రెండేళ్లు లేదా 40,000 కిలోమీటర్ల వరకూ చెల్లుబాటులో ఉంటుంది.

హోండా అమేజ్

హోండా అమేజ్

హైదరాబాద్‍‌లో లభ్యం కానున్న హోండా అమేజ్ సెడాన్ పెట్రోల్ వేరియంట్లు, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

Petrol Variants:

Honda Amaze 1.2 E MT (i-VTEC) - Rs. 508,000

Honda Amaze 1.2 EX MT (i-VTEC) - Rs. 5,34,600

Honda Amaze 1.2 S AT (i-VTEC) - Rs. 6,72,000

Honda Amaze 1.2 S MT (i-VTEC) - Rs. 5,72,600

Honda Amaze 1.2 VX AT (i-VTEC) - Rs. 7,62,000

Honda Amaze 1.2 VX MT (i-VTEC) - Rs. 6,70,000

(All prices are ex-showroom, Hyderabad)

హోండా అమేజ్

హోండా అమేజ్

హైదరాబాద్‍‌లో లభ్యం కానున్న హోండా అమేజ్ సెడాన్ డీజిల్ వేరియంట్లు, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

Diesel Variants:

Honda Amaze 1.5 E MT (i-DTEC) - Rs. 6,18,300

Honda Amaze 1.5 EX MT (i-DTEC) - Rs. 6,42,880

Honda Amaze 1.5 S MT (i-DTEC) - Rs. 6,76,600

Honda Amaze 1.5 VX MT (i-DTEC) - Rs. 7,71,000

(All prices are ex-showroom, Hyderabad)

More from DriveSpark

Article Published On: Saturday, April 20, 2013, 12:35 [IST]
English summary
Honda Cars India Limited (HCIL), leading manufacturer of premium cars in the country, today launched its much awaited family sedan, the Honda Amaze for the Hyderabad market.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+