హోండా అమేజ్ సెడాన్ కోసం 'మాడ్యులో' యాక్ససరీ ప్యాకేజ్
హోండా అమేజ్ ప్రియులకు గుడ్ న్యూస్. హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన తమ తొలి కాంపాక్ట్ సెడాన్ మరియు డీజిల్ కారు అయిన 'హోండా అమేజ్' కోసం కంపెనీ ఇప్పుడు ఓ ప్రత్యేకమైన యాక్ససరీ ప్యాకేజ్‌ను విడుదల చేసింది.
ప్రస్తుత పండుగ సీజన్ నేపథ్యంలో, పలు కంపెనీలు లిమిటెడ్ ఎడిషన్లను, స్పెషల్ ఎడిషన్లను విడుదల చేస్తుంటే, హోండా కూడా తమ అమేజ్ సెడాన్‌ను మరింత ప్రత్యేకంగా చూపించేందుకు 'మాడ్యులో' యాక్ససరీ ప్యాకేజ్‌ను ప్రవేశపెట్టింది.
హోండా ఇప్పటికీ ఈ మాడ్యూలో యాక్ససరీ ప్యాకేజ్‌ను బ్రయో హ్యాచ్‌బ్యాక్, అమేజ్ సెడాన్ల కోసం సౌత్ ఈస్ట్ ఏషియన్ మార్కెట్లలో ఆఫర్ చేస్తుంది. తాజాగా ఇప్పుడు ఈ ప్యాకేజ్‌ను ఇండియన్ కస్టమర్లకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.
హోండా అమేజ్ మాడ్యులో యాక్ససరీస్ ప్యాకేజ్ ప్రత్యేకతలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

* బ్లాక్ గ్రిల్ స్థానంలో ట్విన్ హారిజాంటల్ క్రోమ్ గ్రిల్ (క్రోమ్ సరౌండింగ్స్‌తో).
* ఫ్రంట్ బంపర్‌కు లిప్ స్పాయిలర్

* ఈ బాడీ కిట్‌లో భాగంగా, సైడ్ స్కర్ట్స్, రియర్ స్కర్ట్, ట్రంక్ స్పాయిల్‌ను కూడా ఆఫర్ చేస్తున్నారు.

* రీడిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్ కూడా ఈ ప్యాకేజ్‍లో లభిస్తాయి.

* ఇంటీరియర్స్ అప్‌గ్రేడ్స్ విషయానికి వస్తే, ఇందులో అల్యూమినియం స్పోర్ట్స్ పెడల్స్, ముందు వైపు ఫుట్ లైట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

* యాంత్రికంగా హోండా అమేజ్‌లో ఎలాంటి మార్పులు లేవు. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ (88 హెచ్‌పి పవర్/110 ఎన్ఎమ్ టార్క్), 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ (98 హెచ్‌పి పవర్/200 ఎన్ఎమ్ టార్క్)లతో లభిస్తుంది. రెండు ఇంజన్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటాయి.


Click it and Unblock the Notifications








