బుకింగ్స్‌లో స్విఫ్ట్ డిజైర్‌ను ఓవర్‌టేక్ చేసిన హోండా అమేజ్

By Ravi

జపనీస్ కార్ కంపెనీ హోండా కార్స్ ఇండియా తాజాగా మార్కెట్లో ప్రవేశపెట్టిన తమ మొట్టమొదటి డీజిల్ కారు హోండా అమేజ్ దేశీయ విపణిలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. సరసమైన ధర, అధిక మైలేజ్ (25.8 కెఎమ్‌పిఎల్), సాటిలేని పెర్ఫామెన్స్, ఉత్తమ ఇంటీరియర్స్, మెరుగైన ఫీచర్స్, కాంపాక్ట్ డిజైన్ వంటి అనేక విశిష్టతలతో కూడిన 'హోండా అమేజ్' కొనుగోలుదారులను మొదటి చూపులోనే ఆకట్టుకుంటుంది.

బుకింగ్స్ విషయంలో హోండా అమేజ్ ఇప్పటికే ఈ సెగ్మెంట్లోని తన ప్రధాన పోటీదారు 'స్విఫ్ట్ డిజైర్'ను ఓవర్‌టేక్ చేసింది. హోండా అమేజ్ మార్కెట్లోకి విడుదలైన మూడు వారాల్లోనే కేవలం 22,000 బుకింగ్‌లను సొంతం చేసుకుంది. గడచిన ఏప్రిల్ నెలలో హోండా 4,852 యూనిట్ల అమేజ్ సెడాన్‌లను డెలివరీ చేసి గడచిన సంవత్సరం ఇదే నెల అమ్మకాలతో పోల్చుకుంటే 20 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.

గడచిన నెలలో హోండా తమ అమేజ్ సెడాన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. హైదరాబాద్ మార్కెట్లో హోండా అమేజ్ ప్రారంభ ధర రూ.5.08 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. హోండా అమేజ్ సెడాన్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మొత్తం 10 వేరియంట్లలో (6 పెట్రోల్, 4 డీజిల్) లబిస్తుంది. హోండాకు అమేజ్ మొట్టమొదటి డీజిల్ కారు. భారత్‌లో లభిస్తున్న డీజిల్ కార్లలో కెల్లా అత్యధిక మైలేజీనిచ్చే కారు కూడా అమేజ్ కావటం విశేషం.

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్ సెడాన్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మొత్తం 10 వేరియంట్లలో (6 పెట్రోల్, 4 డీజిల్) లబిస్తుంది. హోండాకు అమేజ్ మొట్టమొదటి డీజిల్ కారు. భారత్‌లో లభిస్తున్న డీజిల్ కార్లలో కెల్లా అత్యధిక మైలేజీనిచ్చే కారు కూడా అమేజ్ కావటం విశేషం.

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్‌ను థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఉన్న ఆసియా పసిఫిక్ కంపెనీ లిమిటెడ్ ఆర్ అండ్ డి కేంద్రంలో అభివృద్ధి చేశారు.

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్ పెట్రోల్ వేరియంట్‌లో 1.2 లీటర్ ఐ-విటెక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 88 పిఎస్‌ల శక్తిని, 109 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కలిగిన వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.

హోండా అమేజ్

హోండా అమేజ్

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, మ్యాన్యూవల్ వేరియంట్ లీటరుకు 18 కిలోమీటర్ల మైలేజీని, ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 15.5 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్ డీజిల్ వేరియంట్‌లో 1.5 లీటర్ ఐ-డిటెక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 100 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్ డీజిల్ వేరియంట్‌ లీటరుకు 25.8 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ తెలిపింది.

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్ సెడాన్ ఆరు ఆకర్షనీయమైన రంగులలో (మెజిస్టిక్ బ్లూ మెటాలిక్, కార్నెలియన్ రెడ్ పెరల్, అర్బన్ టైటానియం మెటాలిక్, అల్బాస్టర్ సిల్వర్ మెటాలిక్, క్రిస్టల్ బ్లాక్ పెరల్ మరియు టఫేటా వైట్) లభిస్తుంది.

హోండా అమేజ్

హోండా అమేజ్

ఇందులో మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

హోండా అమేజ్

హోండా అమేజ్

అమేజ్ సెడాన్‌లో డ్యూయెల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ప్రీటెన్షనర్ సీట్ బెల్ట్స్, ధృఢమైన బాడీ నిర్మాణం వంటి సేఫ్టీ ఫీచర్లున్నాయి.

హోండా అమేజ్

హోండా అమేజ్

అన్ని డీజిల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్లలో ఈబిడితో కూడిన ఏబిఎస్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా అందిస్తున్నారు.

హోండా అమేజ్

హోండా అమేజ్

హైదరాబాద్‍‌లో లభ్యం కానున్న హోండా అమేజ్ సెడాన్ పెట్రోల్ వేరియంట్లు, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

Petrol Variants:

Honda Amaze 1.2 E MT (i-VTEC) - Rs. 508,000

Honda Amaze 1.2 EX MT (i-VTEC) - Rs. 5,34,600

Honda Amaze 1.2 S AT (i-VTEC) - Rs. 6,72,000

Honda Amaze 1.2 S MT (i-VTEC) - Rs. 5,72,600

Honda Amaze 1.2 VX AT (i-VTEC) - Rs. 7,62,000

Honda Amaze 1.2 VX MT (i-VTEC) - Rs. 6,70,000

(All prices are ex-showroom, Hyderabad)

హోండా అమేజ్

హోండా అమేజ్

హైదరాబాద్‍‌లో లభ్యం కానున్న హోండా అమేజ్ సెడాన్ డీజిల్ వేరియంట్లు, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

Diesel Variants:

Honda Amaze 1.5 E MT (i-DTEC) - Rs. 6,18,300

Honda Amaze 1.5 EX MT (i-DTEC) - Rs. 6,42,880

Honda Amaze 1.5 S MT (i-DTEC) - Rs. 6,76,600

Honda Amaze 1.5 VX MT (i-DTEC) - Rs. 7,71,000

(All prices are ex-showroom, Hyderabad)

More from DriveSpark

Article Published On: Saturday, May 4, 2013, 12:36 [IST]
English summary
Within 3 weeks of its launch, Honda Cars India Ltd has received over 22,000 bookings for the Amaze sedan, outshining the response Maruti Suzuki India received for the Swift Dzire, launched a year ago.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+