88,000 మార్కును తాకిన హోండా అమేజ్ సేల్స్

By Ravi

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఏప్రిల్ 2013లో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త కాంపాక్ట్ సెడాన్ హోండా అమేజ్, కస్టమర్లను అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. భారత్‌లో హోండా విడుదల చేసిన మొట్టమొదటి డీజిల్ కారు కావటంతో, ఈ మోడల్‌కు మార్కెట్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. హోండా ఇప్పటి వరకు 88,000 అమేజ్ సెడాన్లను విక్రయించింది.

హోండా గడచిన ఏప్రిల్ 2014 నాటికి 80,000 అమేజ్ కార్లను విక్రయించింది. ఈ మోడల్‌ను ప్రవేశపెట్టి సంవత్సరం పూర్తయి సందర్భంగా కంపెనీ ఇందులో ఓ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను కూడా విడుదల చేసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ కారులో ముందు వైపు బంపర్ క్రింద ప్రత్యేక స్పాయిలర్స్‌ను అలాగే సైడ్స్ మరియు వెనుక వైపున కూడా క్రింది భాగంలో ప్రత్యేక స్పాయిలర్స్‌ను ఆఫర్ చేస్తున్నారు.

Honda Amaze Sales

ఇంకా బూట్ డోర్ స్పాయిలర్, డోర్ విజర్స్, ఎగ్జాస్ట్ పైప్ ఫినిషర్‌లను అందిస్తున్నారు. అంతేకాకుండా, కొత్త అప్‌హోలెస్ట్రీ, డ్యాష్‌బోర్డుపై కాంట్రాస్టింగ్ ఉడ్ ఫినిష్ ప్యానెల్‌ను జోడించారు. వెనుక వైపు వార్షికోత్సవ ఎడిషన్ బ్యాడ్జింగ్‌ను కూడా గమనించవచ్చు. ఈ వార్షికోత్సవ ఎడిషన్ హోండా అమేజ్ విఎక్స్, ఎస్ వేరియంట్లలో మాత్రమే లభ్యమవుతుంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఒక్క మే 2014 నెలలో హోండా మొత్తం 7218 అమేజ్ కార్లను విక్రయించింది. హోండా కార్స్ ఇండియా మొత్తం అమ్మకాలలో అమేజ్ సెడాన్‌దే మెజారిటీ వాటాగా ఉంది. మే 2013లో హోండా మొత్తం 11,342 కార్లను విక్రయిస్తే, మే 2014లో 13,362 కార్లను విక్రయించింది. ఇందులో ఎక్కువ భాగం అమ్మకాలు హోండా అమేజ్‌వే కావటం విశేషం.

More from DriveSpark

Article Published On: Tuesday, June 10, 2014, 9:40 [IST]
English summary
Honda Cars India Ltd. (HCIL), leading manufacturer of premium cars in India, has achieved a new sales milestone with the delivery of 88,000 Honda Amaze in the country. The latest family sedan from Honda in the Indian market, Honda Amaze, has clocked the fastest 88,000 sales for any new model in the company's history in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+