ఏప్రిల్ 18న మార్కెట్లోకి రానున్న హోండా అమేజ్ సెడాన్

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ నుంచి తక్కువ ధర కలిగిన సెడాన్ కోసం ఎదురు చూసే కార్ ప్రియులకు ఇది ఓ రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. హోండా అందిస్తున్న పాపులర్ ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌‌బ్యాక్ 'బ్రయో' ప్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని కంపెనీ అభివృద్ధి చేసిన 'అమేజ్' సెడాన్ వచ్చే నెలలో మార్కెట్లో విడుదల కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, కంపెనీ తమ హోండా అమేజ్ సెడాన్‌ను ఏప్రిల్ 18, 2013న మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, హోండా అమేజ్ సెడాన్ ఇటు పెట్రోల్ ఇంజన్‌ అటు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. హోండా కార్స్ ఇండియా నుంచి దేశీయ విపణిలో లభ్యం కానున్న మొట్టమొదటి డీజిల్ కారు కూడా ఇదే కావటం విశేషం.

హోండా అమేజ్ ఇప్పటికే థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదలై, అక్కడి మార్కెట్లో మంచి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదల చేసిన హోండా బ్రయో సెడాన్ (హోండా అమేజ్) ఎస్ ఎమ్‌టి, ఎస్ ఏటి, వి ఎమ్‌టి, వి ఏటి అనే నాలుగు వేరియంట్లలో లభిస్తోంది. భారత మార్కెట్ కోసం హోండా అభివృద్ధి చేసిన అమేజ్ సెడాన్ విడుదలకు సంబంధించి హోండా ఇప్పటికే తమ అధికారి వెబ్‌సైట్‌లో ఓ టీజర్‌ను విడుదల చేసింది.

హోండా అమేజ్ సెడాన్

హోండా అమేజ్ సెడాన్

హోండా అమేజ్ సెడాన్

హోండా అమేజ్ సెడాన్

హోండా అమేజ్ సెడాన్

హోండా అమేజ్ సెడాన్

హోండా అమేజ్ సెడాన్

హోండా అమేజ్ సెడాన్

హోండా అమేజ్ సెడాన్

హోండా అమేజ్ సెడాన్

హోండా అమేజ్ సెడాన్

హోండా అమేజ్ సెడాన్

హోండా అమేజ్ సెడాన్

హోండా అమేజ్ సెడాన్

హోండా అమేజ్ సెడాన్

హోండా అమేజ్ సెడాన్

హోండా అమేజ్ సెడాన్

హోండా అమేజ్ సెడాన్


పెట్రోల్ వెర్షన్ హోండా అమేజ్‌లో 1.2 లీటర్, 4-సిలిండర్, 16-వాల్వ్ పెట్రలో ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది, ఇందులో మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో పాటుగా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ ఆప్షన్ కూడా లభ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇకపోతే డీజిల్ వెర్షన్ అమేజ్ సెడాన్‌లో, ఎర్త్ డ్రీమ్స్ సంస్థతో కలిసి హోండా అభివృద్ధి చేసిన 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 100 హెచ్‌పిల శక్తిని, 210 ఎన్‌మ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వెర్షన్ హోండా అమేజ్ లీటరుకు సుమారు 18-20 కి.మీ. మైలేజీని, డీజిల్ వెర్షన్ అమేజ్ లీటరుకు సుమారు 22-24 కి.మీ. మైలేజీని ఇవ్వనుంది. ఇది ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వంటి మోడళ్లకు గట్టి పోటీగా నిలువనుంది.

More from DriveSpark

Article Published On: Monday, March 4, 2013, 10:34 [IST]
English summary
Honda Car India is expected to launch its entry-level sedan Brio Amaze on 18th April 2013. Recently Honda launched this Brio Amaze sedan in Thailand. Amaze happens to be Honda's first diesel model - a car that is the sedan version of the Brio hatchback.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+