హోండా బ్రయో హ్యాచ్‌‌బ్యాక్‌లో కొత్త వేరియంట్ విడుదల

By Ravi

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ దేశీయ విపణిలో అందిస్తున్న చిన్న కారు 'హోండా బ్రయో'లో ఓ కొత్త వేరియంట్‌ను కంపెనీ పరిచయం చేసింది. హోండా తమ ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ బ్రయోలో 'విఎక్స్' అనే టాప్-ఎండ్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ టాప్-ఎండ్ వేరియంట్ బ్రయో విఎక్స్ ఇటు మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ అటు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది.

హోండా బ్రయో విఎక్స్ టాప్-ఎండ్ వేరియంట్లో ఇంజన్ పరంగా ఎలాంటి సాంకేతిక మార్పులు లేవు. అయితే, ఇందులో ఎత్తుకు తగినట్లుగా సర్దుబాటు చేసుకునేందుకు వీలుండే డ్రైవర్ సీట్, వెనుక వైపు విండ్‌షీల్డ్ డిఫాగ్గర్‌లను చేర్చారు. ఇప్పటికే భారత రోడ్లపై 32,000 లకు పైగా బ్రయో కార్లు తిరుగుతున్నాయని, వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా ఉత్పత్తులను అప్‌గ్రేడ్ చేయాల్సిన అసరం ఎంతైనా ఉందని, అందుకే ఈ బ్రయో విఎక్స్ వేరియంట్‌‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు.

ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న హోండా బ్రయో వేరియంట్లు, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

  • హోండా బ్రయో ఈ (మ్యాన్యువల్) - రూ.4,12,000
  • హోండా బ్రయో ఈఎక్స్ (మ్యాన్యువల్) - రూ.4,28,000
  • హోండా బ్రయో ఎస్ (మ్యాన్యువల్) - రూ.4,60,500
  • హోండా బ్రయో వి (మ్యాన్యువల్) - రూ.5,06,000
  • హోండా బ్రయో విఎక్స్ (మ్యాన్యువల్) - రూ.5,34,500
  • హోండా బ్రయో విఎక్స్ (ఆటోమేటిక్) - రూ.6,12,500

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

Honda Brio

More from DriveSpark

Article Published On: Tuesday, May 7, 2013, 16:07 [IST]
English summary
Honda has added a new variant to its Brio compact hatchback lineup. The new top end 'VX' trim will be available with both manual and automatic transmission option.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+