హోండా అమేజ్ వార్షికోత్సవ ఎడిషన్ విడుదల; వివరాలు
జపనీస్ కార్ కంపెనీ హోండా, భారత మార్కెట్లో మొట్టమొదటి సారిగా తమ తొలి డీజిల్ కారు 'హోండా అమేజ్'ను ప్రవేశపెట్టి అప్పుడే ఏడాది పూర్తయిపోయింది. ఇప్పటి వరకు 80,000 యూనిట్లకు పైగా అమేజ్ కార్లు అమ్ముడుపోయాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, కంపెనీ ఇందులో ఓ వార్షికోత్సవ (యానివర్స్‌రే) ఎడిషన్‌ను విడుదల చేసింది.
రెగ్యులర్ హోండా అమేజ్‌తో పోల్చుకుంటే, ఈ వార్షికోత్సవ ఎడిషన్ హోండా అమేజ్‌లో మరిన్ని అదనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి. ఈ లిమిటెడ్ ఎడిషన్ కారులో ముందు వైపు బంపర్ క్రింద ప్రత్యేక స్పాయిలర్స్‌ను అలాగే సైడ్స్ మరియు వెనుక వైపున కూడా క్రింది భాగంలో ప్రత్యేక స్పాయిలర్స్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఇంకా బూట్ డోర్ స్పాయిలర్, డోర్ విజర్స్, ఎగ్జాస్ట్ పైప్ ఫినిషర్‌లను అందిస్తున్నారు.

ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, కొత్త అప్‌హోలెస్ట్రీ, డ్యాష్‌బోర్డుపై కాంట్రాస్టింగ్ ఉడ్ ఫినిష్ ప్యానెల్‌ను జోడించారు. వెనుక వైపు వార్షికోత్సవ ఎడిషన్ బ్యాడ్జింగ్‌ను కూడా గమనించవచ్చు. ఈ వార్షికోత్సవ ఎడిషన్ హోండా అమేజ్ విఎక్స్, ఎస్ వేరియంట్లలో మాత్రమే లభ్యమవుతుంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది.
రెగ్యులర్ హోండా అమేజ్ విఎక్స్, ఎస్ వేరియంట్ల కన్నా ఈ వార్షికోత్సవ ఎడిషన్ ధర రూ.71,861లు ఎక్కువగా ఉంటుంది.
ప్రస్తుతం హోండా అమేజ్ 1.2 విఎక్స్ ఎమ్‌టి (పెట్రోల్ వెర్షన్) ధర రూ.6.64 లక్షలు గాను, 1.5 విఎక్స్ ఎమ్‌టి (డీజిల్ వెర్షన్) ధర రూ.7.49 లక్షలు గాను, 1.2 ఎమ్ ఎమ్‌టి (పెట్రోల్ వెర్షన్) ధర రూ.5.69 లక్షలు గాను, 1.5 ఎస్ ఎమ్‌టి (డీజిల్ వెర్షన్) ధర రూ.6.65 లక్షలు గాను ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).


Click it and Unblock the Notifications








