బ్రయో ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌ను విడుదల చేసిన హోండా

By Ravi

ప్రస్తుత పండుగ సీజన్‌లో కస్టమర్లను ఆకట్టుకునేందుకు కార్ల తయారీ కంపెనీలు కొత్త కొత్త ప్లాన్స్‍‌‌తో ముందుకొస్తున్నాయి. ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకొని హోండా తమ వినియోగదారుల కోసం బ్రయో హ్యాచ్‌బ్యాక్‌లో ఓ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. 'హోండా బ్రయో ఎక్స్‌క్లూజివ్' (Honda Brio Exclusive) పేరుతో విడుదలైన ఈ కారులో, రెగ్యులర్ బ్రయోతో పోల్చుకుంటే మరిన్ని అధనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి.

హోండా బ్రయో ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌లో ఇంటీరియర్స్‌ను ఆల్ బ్లాక్ థీమ్‌తో డిజైన్ చేశారు. ఇందులో డోర్ ప్యాడ్స్, ఏ-పిల్లర్ కవర్స్, రూఫ్, సీట్ అప్‌హోలెస్ట్రీ మొదలైనవన్నీ నలుపు రంగులోనే ఉంటాయి. ఇల్యుమినేటెడ్ సైడ్-స్టెప్ గార్నిష్ ఇందులో మరొక ప్రత్యేకత. అలాగే ఎక్స్టీరియర్స్‌ను పరిశీలిస్తే, విండో విజర్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, ఎగ్జాస్ట్ పైప్ ఫినిషర్, రియర్ స్పాయిలర్‌తో పాటుగా ఎక్స్‌క్లూజివ్ బ్యాడ్జ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

బ్లాక్ ఇంటీరియర్లతో కూడిన కొత్త ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ బ్రయోను విడుదల చేయటం తమకు సంతోషంగా ఉందని, కస్టమర్లకు ఎల్లప్పుడు తాజా ఉత్పత్తులను అందించాలనే తమ లక్ష్యంలో భాగంగానే, ఈ వేరియంట్‌ను ప్రవేశపెట్టామని, ఈ కొత్త బ్రయోకు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించగలదని ఆశిస్తున్నామని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు.

హోండా బ్రయో ఎక్స్‌క్లూజివ్ ధర, ఇతర వివరాల కోసం క్రింది ఫొటో ఫీచర్‌ని పరిశీలించండి.

ధర

ధర

ఇన్ని ప్రత్యేక ఫీచర్లు కలిగిన హోండా బ్రయో ఎక్స్‌క్లూజివ్ ధర రూ.4.92 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

కొత్త వేరియంట్

కొత్త వేరియంట్

ఈ ఎక్స్‌క్లూజివ్ వేరియంట్‌ను ఎస్ ఎమ్‌టి వేరియంట్ మరియు ఎస్ (ఓ) ఎమ్‌‌టి వేరియంట్లకు మధ్యలో ఆఫర్ చేయనున్నారు.

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

ఈ లిమిటెడ్ ఎడిషన్ బ్రయో టఫ్ఫెటా వైట్, ఆల్బాస్టర్ సిల్వర్ మరియు ర్యాలీ రెడ్ అనే మూడు రంగులలో మాత్రమే లభిస్తుంది.

ఇంజన్

ఇంజన్

హోండా బ్రయో ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో అదే 1.2 లీటర్ ఐవిటెక్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, October 1, 2013, 10:02 [IST]
English summary
Honda Cars India has launched a new Exclusive edition of Brio with all black interiors and additional features. Honda Brio Exclusive Edition is priced at Rs 4.92 lakhs (ex-showroom Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+