సిఎన్‌జి రెడీ హోండా అమేజ్ విడుదల; ధరెంతో తెలుసా?
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సిఐఎల్) దేశీయ విపణిలో విక్రయిస్తున్న కాంపాక్ట్ సెడాన్ అమెజ్‌లో కంపెనీ మరో కొత్త వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. 'హోండా అమేజ్ 1.2 ఎస్ ఎమ్‌టి ప్లస్' (Honda Amaze 1.2 S MT Plus) పేరుతో విడుదలైన ఈ పెట్రోల్ వేరియంట్ సిఎన్‌జి రెడీ ఆప్షన్‌తో లభ్యం కానుంది.
అంటే.. ఈ కొత్త హోండా అమేజ్ 1.2 ఎస్ ఎమ్‌టి ప్లస్ వేరియంట్‌లో సిఎన్‌జి కిట్‌ను అమర్చుకోవచ్చన్నమాట. ఈ కొత్త వేరియంట్ అమేజ్ ధర రూ.5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్ కోసం కస్టమర్లు అదనంగా రూ.54,315 చెల్లించాల్సి ఉంటుంది. దేశంలో సిఎన్‌జి ఫ్యూయెల్ అందుబాటులో ఉన్న అన్ని ప్రాంతాలలో ఈ కొత్త అమేజ్ 1.2 ఎస్ ఎమ్‌టి ప్లస్ (ఐ-విటెక్) వేరియంట్ అందుబాటులో ఉండనుంది.
సిఎన్‌జి ఇంధనాన్ని సపోర్ట్ చేసే విధంగా ఇందులోని 1.2 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్‌లో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేశారు. సిఎన్‌జి కిట్ చేరిక వలన పెరిగే బరువుకు అనుగుణంగా సస్పెన్షన్‌ను ట్యూన్ చేశారు. అలాగే, హైలెవల్ క్వాలిటీ ఉండేలా ప్రత్యేకంగా వైరింగ్ హార్నెసెస్ చేశారు. ఈ కొత్త వేరియంట్ 2 ఏళ్ల స్టాండర్డ్ వారంటీతో లభ్యం కానుంది.



Click it and Unblock the Notifications








