నాలుగు కొత్త కార్లను విడుదల చేయనున్న హోండా
జపనీస్ కార్ కంపెనీ హోండా కార్స్ ఇండియా, దేశీయ విపణిలో పెరుగుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా, 2015 నాటికి భారత మార్కెట్లో నాలుగు కొత్త మోడళ్లను విడుదల చేయనున్న కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
అత్యంత పాపులర్ అయిన కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ హోండా జాజ్‌లో ఓ అప్‌గ్రేడెడ్ వేరియంట్‌ను అలాగే ఓ సరికొత్త కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్‌ను మరియు ఓ సెవన్ సీటర్ ఎమ్‌పివిలతో పాటుగా ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న ప్రీమియం సెడాన్ హోండా సిటీలో ఓ అప్‌గ్రేడెడ్ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేస్తామని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు.
తాము నాలుగు కొత్త మోడళ్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, తొలుతగా నెక్స్ట్ జనరేషన్ జాజ్‌ను విడుదల చేస్తామని ఆ తర్వాత ఓ సెవన్ సీటర్ ఎమ్‌పివి, మరొక కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేస్తామని, వీటి తర్వాత అప్‌గ్రేడెడ్ సిటీ సెడాన్‌ను ప్రవేశపెడతామని ఆయన చెప్పారు.
హోండా కార్స్ ఇండియా ప్రస్తుతం భారత మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బ్రయో, మిడ్-సైజ్ సెడాన్ అమేజ్, ప్రీమియం సెడాన్ సిటీ, ప్రీమియం ఎస్‌యూవీసిఆర్‌వి మరియు లగ్జరీ సెడాన్ అకార్డ్ మోడళ్లను విక్రయిస్తుంది. హోండాకు దేశవ్యాప్తంగా ఉన్న 150 డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా ఈ మోడళ్లు అందుబాటులో ఉండనున్నాయి.

నెక్స్ట్ జనరేషన్ హోండా జాజ్
హోండా నుంచి నాలుగు కొత్త మోడళ్లు మార్కెట్లోకి రానున్నయి. అందులో మొదటిది నెక్స్ట్ జనరేషన్ హోండా జాజ్.

నెక్స్ట్ జనరేషన్ హోండా జాజ్
ఇటీవల జరిగిన బీజింగ్ ఆటో షోలో హోండా ఆవిష్కరించిన కాన్సెప్ట్ ఎస్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త 2014 జాజ్‌ను అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం.

కాంపాక్ట్ ఎస్‌యూవీ
ప్రస్తుతం భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు డిమాండ్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ సెగ్మెంట్లో కూడా హోండా ఓ కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టనుంది.

కాంపాక్ట్ ఎస్‌యూవీ
ఇటీవల జరిగిన డెట్రాయిట్ మోటార్ షోలో హోండా ఆవిష్కరించిన అర్బన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆధారంగా చేసుకొని హోండా తమ కొత్త కాంపాక్ట్ ఎస్‌యీవీని అభివృద్ధి చేయనుంది.

సెవన్ సీటర్ ఎమ్‌పివి
భారత మార్కెట్లో ఎమ్‌పివి సెగ్మెంట్ కూడా ఊపందుకోవటంతో ఈ సెగ్మెంట్లో ఓ సరికొత్త 7-సీటర్ ఎమ్‌పివిని ప్రవేశపెడతామని హోండా పేర్కొంది. హోండా గ్లోబల్ మార్కెట్లలో అందిస్తున్న ఫ్రీడ్ ఎమ్‌పివిని ఆధారంగా చేసుకొని ఈ కొత్త మోడల్‌ను విడుదల చేయవచ్చని సమాచారం.

అప్‌గ్రేడెడ్ హోండా సిటీ
ప్రస్తుతం హోండా భారత మార్కెట్లో అందిస్తున్న సిటీ సెడాన్‌లో ఓ అప్‌గ్రేడెడ్ మోడల్‌ను విడుదల చేయనుంది. క్రైడర్ సెడాన్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త సిటీ ఉంటుందని సమాచారం.



Click it and Unblock the Notifications








