హోండా సిటీ పెట్రోల్, డీజిల్ వేరియంట్లు, ధరల వివరాలు వెల్లడి
హోండా కార్స్ ఇండియా ఇటీవల భారత మార్కెట్లో ఆవిష్కరించిన సరికొత్త 2014 హోండా సిటీని మంగళవారం దేశీయ విపణిలో వాణిజ్య పరంగా విడుదల, ఈ మోడల్ వేరియంట్లు, వాటి ధరలు మరియు ఇతర వివరాలను కంపెనీ వెల్లడించింది. ఈ ఫోర్త్ జనరేషన్ హోండా సిటీ సెడాన్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో పాటుగా డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లో కూడా లభ్యం కానుంది. దేశీయ మార్కెట్లో 2014 హోండా సిటీ సెడాన్ ధరలు రూ.7.42 లక్షల నుంచి రూ.11.1 లక్షల (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయి.
కొత్త 2014 హోండా సిటీలో ఇంజన్లను రీఫైన్ చేశారు. ఇందులో ఉపయోగించిన 1.5 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్ 119 పిఎస్‌ల శక్తిని, 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 17.8 కి.మీ. మైలేజీని, ఆటోమేటిక్ వెర్షన్ 17.9 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.
ఇకపోతే డీజిల్ వెర్షన్ హోండా సిటీలో అధునాతన 1.5 లీటర్ ఐ-డిటెక్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 100 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 26 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.
ఇది కూడా చదవండి: 2014 హోండా సిటీ టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్ - రివ్యూ

కొత్త 2014 హోండా సిటీ మొత్తం 12 వేరియంట్లలో (7 పెట్రోల్ వేరియంట్లు, 5 డీజిల్ వేరియంట్లు) లభ్యం కానుంది. టాప్-ఎండ్ వేరియంట్లో 5 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, 8-స్పీకర్ సిస్టమ్, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, కీలెస్ ఎంట్రీ, 4 పవర్ సాకెట్స్, సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ మిర్రర్స్, రియర్ ఏసి వెంట్స్, కారును నడిపే వేగాన్ని బట్టి కలర్ మారే ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ వంటి అనేక విశిష్టమైన ఫీచర్లు లభ్యం కానున్నాయి.
హోండా సిటీ వేరియంట్లు, వాటి ధరల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
హోండా సిటీ పెట్రోల్ ధరలు:
- హోండా సిటీ ఈఎమ్‌టి - రూ. 7.42 లక్షలు
- హోండా సిటీ ఎస్ఎమ్‌టి - రూ. 8.04 లక్షలు
- హోండా సిటీ ఎస్‌విఎమ్‌టి - రూ. 8.49 లక్షలు
- హోండా సిటీ విఎమ్‌టి - రూ. 8.99 లక్షలు
- హోండా సిటీ విఎక్స్ఎమ్‌టి - రూ. 9.93 లక్షలు
- హోండా సిటీ ఎస్ఎక్స్ఏటి - రూ. 9.49 లక్షలు
- హోండా సిటీ విఎక్స్ఏటి - రూ. 10.98 లక్షలు
హోండా సిటీ డీజిల్ ధరలు:
- హోండా సిటీ ఈఎమ్‌టి - రూ. 8.62 లక్షలు
- హోండా సిటీ ఎస్ఎమ్‌టి - రూ. 9.24 లక్షలు
- హోండా సిటీ ఎస్‌విఎమ్‌టి - రూ. 9.66 లక్షలు
- హోండా సిటీ విఎమ్‌టి - రూ. 10.16 లక్షలు
- హోండా సిటీ విఎక్స్ఎమ్‌టి - రూ. 11.1 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications








