హోండా సిటీ విడుదల తేది ఖరారు; జనవరి 7న విడుదల
భారత మార్కెట్లో సరికొత్త 2014 హోండా సిటీ సెడాన్ విడుదలకు ముహుర్తం ఖరారైంది. సరిగ్గా మరో పది రోజుల్లో ఈ కొత్త సిటీ విడుదల కానుంది. జనవరి 7, 2014న తమ కొత్త సిటీ సెడాన్‌ను మార్కెట్లో వాణిజ్యం పరంగా అందుబాటులోకి తీసుకువస్తామని హోండా కార్స్ ఇండియా వెల్లడించింది. హోండా తమ 2014 సిటీ సెడాన్‌ను గడచిన నవంబర్ 25, 2013న భారత మార్కెట్లో తొలిసారిగా ఆవిష్కరించింది.
హోండా కార్స్ ఇండియా తొలుతగా ఈ కారును జనవరి 6న ఢిల్లీలో విడుదల చేసి వేరియంట్లు, ధరలు, ఫీచర్ల వివరాలు వెల్లడిస్తుంది. ఆ తర్వాత రోజున ఇది ముంబైలో విడుదలవుతుంది. అనంతరం దశల వారీగా ఇది దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. కంపెనీ ఇప్పటికే తమ కొత్త 2014 హోండా సిటీకి సంబంధించి మీడియా టెస్ట్ డ్రైవ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది.
ఇది కూడా చదవండి: 2014 హోండా సిటీ సెడాన్ టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్
కొత్త 2014 హోండా సిటీ సెడాన్ బేసిక్ షేప్, మునుపటి వెర్షన్ సిటీ సెడాన్ బేసిక్ షేప్‌కు పెద్దగా వ్యత్యాసం కనిపించదు. అయితే, కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్, అధునాత ఫీచర్లను పరిగణలోకి తీసుకుంటే, ఇది మునుపటి సిటీ కన్నా మెరుగ్గా ఉంటుంది. కొత్త హోండా సిటీకి ఇప్పటికే మార్కెట్లో మంచి క్రేజ్ నెలకొని ఉంది. దేశంలో కొందరు హోండా డీలర్లు ఇప్పటికే బుకింగ్‌లను స్వీకరించడాన్ని కూడా ప్రారంభించారు.
ఇప్పుడు కొనుగోలుదారుల ఆసక్తి అంతా కొత్త హోండా సిటీ సెడాన్ ధరపైనే కేంద్రీకృతమై ఉంది. హోండా సరసమైన ధరకే ఈ కారును ఆఫర్ చేయగలితే, ఈ పాపులర్ కారుకు తిరుగే ఉండదు. హోండాకు ఈ సత్యం తెలుసు కాబట్టి, ప్రారంభంలో భాగంగా సరసమైన ధరకే ఈ కారును విడుదల చేసే అవకాశం ఉంది. దీని ప్రారంభ ధర రూ.7.5 లక్షల నుంచి రూ.8. లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications









