బ్రెజిల్ మార్కెట్లో హోండా సిటీ స్పోర్ట్స్ విడుదల

By Ravi

హోండా సిటీ బ్రెజిల్ కస్టమర్స్ లక్కీ ఛాన్స్ కొట్టేశారు. ఇప్పటి వరకూ ఎగ్జిక్యూటివ్ సెడాన్ రూపంలో దర్శనమిచ్చు హోండా పాపులర్ మిడ్-సైజ్ సెడాన్ ఇప్పుడు మరింత స్పోర్టీయర్‌గా మారిపోయింది. జపనీస్ కార్ కంపెనీ హోండా బ్రెజిల్ మార్కెట్ కోసం హోండా సిటీలో ఓ స్పోర్ట్స్ వెర్షన్‌ను అభివృద్ధి చేసింది. హోండా సిటీ స్పోర్ట్స్ పేరుతో ఓ సరికొత్త వెర్షన్‌ను కంపెనీ బ్రెజిల్‌లలో విడుదల చేసింది.

రెగ్యులర్ వెర్షన్ హోడా సిటీకి హోండా సిటీ స్పోర్ట్స్‌కు బేసిక్ డిజైన్, ఇంజన్, పెర్ఫామెన్స్ విషయాల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. సిటీ స్పోర్ట్స్‌ ఇంటీరియర్, ఎక్స్టీరియర్లలో మాత్రమే అనేక మార్పులు చేయబడ్డాయి. బ్రెజిల్ మార్కెట్లో హోండా సిటీ స్పోర్ట్స్ ధర 56,470 బ్రెజిలియన్ రియల్స్ (మన దేశ కరెన్సీలో సుమారు రూ.15.04 లక్షలు). ఆ మార్పులేంటో, హోండా సిటీ సెడాన్ స్పోర్ట్స్ విశిష్టతలేంటో క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

డిజైన్

డిజైన్

బేస్ మోడల్ సిటీ (అక్కడి మార్కెట్లో డిఎక్స్ అనిపిలుస్తారు)ను ఆధారంగా చేసుకొని స్పోర్ట్స్ ఎడిషన్‌ను అభివృద్ధి చేశారు.

ఎక్స్టీరియర్

ఎక్స్టీరియర్

హోండా సిటీ స్పోర్ట్స్‌లో ఫ్రంట్ గ్రిల్‌ను మ్యాట్ బ్లాక్ కలర్‌లో పెయింట్ చేశారు. హెడ్‌లైట్ యూనిట్ కూడా బ్లాక్ మాస్క్‌ను కలిగి ఉంటుంది.

అల్లాయ్ వీల్స్

అల్లాయ్ వీల్స్

హోండా సిటీ స్పోర్ట్స్‌లో టాప్-ఎండ్ వేరియంట్ నుంచి గ్రహించిన 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను జోడించారు.

రియర్ డిజైన్

రియర్ డిజైన్

హోండా సిటీ స్పోర్ట్స్ వెనుక వైపు క్రోమ్ ఎగ్జాస్ట్ టిప్ (సైలెన్సర్)ను అమర్చారు.

ఇంటీరియర్స్

ఇంటీరియర్స్

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో సిల్వర్ ఫినిష్ పెడల్స్‌ను గమనించవచ్చు.

సీట్ కవర్స్

సీట్ కవర్స్

అలాగే, సీట్ ఫ్యాబ్రిక్‌ను కూడా బ్లాక్-సిల్వర్ కాంబినేషన్ కలర్‌తో డిజైన్ చేశారు.

సేఫ్టీ ఫీచర్స్

సేఫ్టీ ఫీచర్స్

హోండా సిటీ స్పోర్ట్స్‌‌లో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, అన్ని చక్రాల్లో డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లను జోడించారు.

రెడ్ ర్యాలీ సాలిడ్ కలర్

రెడ్ ర్యాలీ సాలిడ్ కలర్

హోండా సిటీ స్పోర్ట్స్ రెడ్ ర్యాలీ సాలిడ్ కలర్‌లో లభ్యమవుతుంది.

More from DriveSpark

Article Published On: Friday, July 19, 2013, 16:55 [IST]
English summary
Honda has launched a sports version of its best selling sedan City in Brazil market. The Honda City Sports does not boast of any mechanical changes to make it go faster, its purely cosmetic inside and out. It has been priced at 56,470 Brazilian Reals (INR 15.04 lakhs).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+