యూకే కోసం హోండా సిఆర్-వి బ్లాక్ అండ్ వైట్ ఎడిషన్స్‌‌

By Ravi

ఇటీవలి కాలంలో కార్ కంపెనీలు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి. కార్ల అమ్మకాలను పెంచుకునేందుకు, అలాగే ఉన్న కారునే మరింత కొత్తగా చూపించేందుకు 'స్పెషల్ ఎడిషన్స్‌‌'ల బాట పడుతున్నాయి. రెగ్యులర్ కారుకు కొద్దిపాటి కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ చేయటం ద్వారా వాటిని మరింత కొత్తగా, విశిష్టంగా చూపి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి కార్ల తయారీ కంపెనీలు.

తాజాగా.. జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా మోటార్ కార్పోరేషన్, తమ యూకె వినియోగదారుల కోసం ఓ సరికొత్త సిఆర్-వి ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది. 'హోండా సిఆర్-వి బ్లాక్ అండ్ వైట్' ఎడిషన్స్‌‌ పేరిట స్టాండర్డ్ హోండా సిఆర్-వి కన్నా మరింత స్టయిలిష్‌గా, ప్రీమియంగా కనిపించే ఓ లిమిటెడ్ ఎడిషన్స్‌‌ మోడల్‌ను కంపెనీ తయారు చేసింది.

మరి ఈ బ్లాక్ అండ్ వైట్ ఎడిషన్స్‌‌ హోండా సిఆర్-వి ఎస్‌యూవీలోని హైలైట్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

హోండా సిఆర్-వి బ్లాక్ అండ్ వైట్ ఎడిషన్స్‌‌

యూకే మార్కెట్ కోసం హోండా తయారు చేసిన ఈ సరికొత్త బ్లాక్ అండ్ వైట్ ఎడిషన్స్‌‌ హోండా సిఆర్-వి ఎస్‌యూవీలో బాడీ పెయింట్‌ కలర్‌తో పాటుగా కొన్ని చిన్నపాటి కాస్మోటిక్ మార్పులు మినహా, బేసిక్ డిజైన్ మరియు ఇంజన్లలో ఎలాంటి మార్పులు లేవు.

హోండా సిఆర్-వి బ్లాక్ అండ్ వైట్ ఎడిషన్స్‌‌

హోండా సిఆర్-వి బ్లాక్ అండ్ వైట్ ఎడిషన్స్‌‌‌లో స్టాండర్డ్ ఫీచర్లుగా.. 19 ఇంచ్ ఓరియన్ అల్లాయ్ వీల్స్, ఎగ్జాస్ట్ ఫినిషర్స్, ప్రైవసీ గ్లాస్, కొత్త ఫ్రంట్ గ్రిల్, టెయిల్‌గేట్ స్పాయిలర్, ఇంటిగ్రేటెడ్ రన్నింగ్ బోర్డ్స్ మరియు ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్స్‌ను ఆఫర్ చేస్తున్నారు.

హోండా సిఆర్-వి బ్లాక్ అండ్ వైట్ ఎడిషన్స్‌‌

అడిషనల్ ఎక్విప్‌మెంట్‌లో భాగంగా.. డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, హై-పవర్ బ్లూటూత్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్, పవర్ ఫోల్డింగ్ మిర్రర్స్ మరియు శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌లను ఆఫర్ చేస్తున్నారు.

హోండా సిఆర్-వి బ్లాక్ అండ్ వైట్ ఎడిషన్స్‌‌

యూకే మార్కెట్లో బ్లాక్ అండ్ వైట్ ఎడిషన్స్‌‌ హోండా సిఆర్-వి ఎస్‌యూవీ ప్రారంభం ధర 28,400 యూరోలు (మన కరెన్సీలో సుమారు రూ.29.36 లక్షలు)గా ఉంది.

హోండా సిఆర్-వి బ్లాక్ అండ్ వైట్ ఎడిషన్స్‌‌

యూకే మార్కెట్లో ఈ కొత్త హోండా సిఆర్-వి ఎస్‌యూవీ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్లలో లభ్యమవుతుంది. ఇది 2.0 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్ మరియు 2.2 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది.

More from DriveSpark

Article Published On: Monday, February 24, 2014, 10:51 [IST]
English summary
Honda CR-V Black & White edition launched in the UK. Features, price of Honda CR-V Black & White Editions are as follows. Take look at the images and specs of new Honda CR-V Black & White Edition.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+