జపాన్‌లో హోండా సిటీ హైబ్రిడ్ వేరియంట్ విడుదల
జపనీస్ కార్ కంపెనీ హోండా మోటార్ కార్పోరేషన్, జపాన్ మార్కెట్లో హైబ్రిడ్ వెర్షన్ హోండా సిటీని విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. భారత మార్కెట్లో హోండా విక్రయిస్తున్న సిటీ సెడాన్‌ను జపాన్ మార్కెట్లో హోండా గ్రేస్ పేరిట విక్రయిస్తోంది. జపాన్‌లో ఇప్పటి వరకూ పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తున్న హోండా గ్రేస్, ఇకపై హైబ్రిడ్ వెర్షన్‌లో కూడా లభ్యం కానుంది.
డిసెంబర్ 1వ తేదీన జపాన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హోండా తమ సరికొత్త సిటీ హైబ్రిడ్ (అక్కడి మార్కెట్లో గ్రేస్)ని విడుదల చేసింది. ఇందులో ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, క్లియర్ లెన్స్ హెడ్‌లైట్స్, సరికొత్త ఫ్రంట్ బంపర్ వంటి మార్పులు ఉన్నాయి. కొత్త హోండా సిటీ (గ్రేస్)లో పెట్రోల్ ఇంజన్‍తో పాటుగా ఓ ఎలక్ట్రిక్ మోటార్‌ను కూడా ఉపయోగించారు. ఇది మూడు వేరియంట్లలో 2-వీల్ డ్రైవ్, 4-వీల్ డ్రైవ్ ఆప్షన్లతో లభిస్తోంది.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో హోండా సిటీ హైబ్రిడ్ ఇంజన్, మైలేజ్ వివరాలను తెలుసుకోండి.

హోండా సిటీ (గ్రేస్) హైబ్రిడ్‌లో 1.5 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పిల శక్తిని, 134 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

అలాగే, ఇందులో ఓ హై అవుట్‌పుట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 28 బిహెచ్‌పిల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్ ఉంటుంది.

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం.. టూ-వీల్ డ్రైవ్ హోండా గ్రేస్ హైబ్రిడ్ 34.8 కెఎమ్‌పిఎల్ మైలేజీని మరియు ఫోర్-వీల్ డ్రైవ్ హోండా గ్రేస్ హైబ్రిడ్ 29.4 కెఎమ్‌పిఎల్ మైలేజీని ఆఫర్ చేస్తుంది.

ప్రస్తుతానికి హోండా సిటీ హైబ్రిడ్ వెర్షన్‌ను జపాన్ మార్కెట్లో మాత్రమే లభ్యం కానుంది. ఇతర మార్కెట్లలో ఈ హైబ్రిడ్ సిటీ సెడాన్‌ను విడుదల చేసే అంశంపై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. జపాన్ మార్కెట్లో దీని ధర 1.95 మిలియన్ యెన్‌లుగా ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








