ఆగస్ట్‌లో హోండా సిటీ ఉత్పత్తి బంద్; రాజస్థాన్‌కు తరలింపు
జపనీస్ ఆటోమొబైల్ బ్రాండ్ హోండా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న సిటీ సెడాన్ ఉత్పత్తిని ఒక ప్లాంట్ నుంచి మరో ప్లాంట్‌కు తరలించనుంది. ప్రస్తుతం ఈ మోడల్‌కు భారీ డిమాండ్ ఉన్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, డిమాండుకు అనుగుణంగా ఉత్పత్తిని సాధించాలనే ఉద్దేశ్యంతో, ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలో తయారు చేస్తున్న సిటీ సెడాన్‌ను రాజస్థాన్‌కు తరలింంచనున్నారు.
ఇది కూడా చదవండి: హోండా సిటీ టెస్ట్ డ్రైవ్ రివ్యూ
ఈ ప్రక్రియలో భాగంగా, ఆగస్ట్ నెలలో ఒక్క హోండా సిటీ కూడా ఉత్పత్తి కాదు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి రాజస్థాన్‌లో అల్వార్ వద్ద ఉన్న తపుకరా ప్లాంట్‌లో సిటీ ఉత్పత్తి యథాతథంగా ప్రారంభం కానుంది. ఈ ప్లాంట్‌లో ఇప్పటికే హోండా అమేజ్ సెడాన్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. కాగా.. గ్రేటర్ నోయిడా ప్లాంట్‌లో హోండా మొబిలియో ఉత్పత్తిని కొత్తగా ప్రారంభించారు.

రాజస్థాన్‌లో తపుకరా ప్లాంట్ సామర్థ్యం సాలీనా 1.2 లక్షల యూనిట్లు. ఈ ప్లాంట్‌లో ప్రస్తుతం సింగిల్ షిఫ్ట్ మాత్రమే నడుస్తోంది. సిటీ డిమాండ్‌ను చేరుకునేందుకు కంపెనీ రెండవ షిఫ్టును ప్రారంభించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. హోండా సిటీ మరియు కొత్తగా విడుదల చేసిన హోండా మొబిలియో లభ్యత, డెలివరీల విషయంలో జాప్యం జరగకుండా ఉండేందుకే సిటీ ఉత్పత్తిని తలిస్తున్నామని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) పి జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు.
ఇది కూడా చదవండి: హోండా మొబిలియో విడుదల, ధరలు
ప్రస్తుతం హోండా అందిస్తున్న 4వ తరానికి చెందిన (ఫోర్త్ జనరేషన్) హోండా సిటీ, ఇది పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో పాటుగా డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లో కూడా లభ్యమవుతుంది. కొత్త 2014 హోండా సిటీలో ఇంజన్లను రీఫైన్ చేశారు. ఇందులో ఉపయోగించిన 1.5 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్ 119 పిఎస్‌ల శక్తిని, 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 17.8 కి.మీ. మైలేజీని, ఆటోమేటిక్ వెర్షన్ 17.9 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

డీజిల్ వెర్షన్ హోండా సిటీలో అధునాతన 1.5 లీటర్ ఐ-డిటెక్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 100 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 26 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. హోండా సిటీ పెట్రోల్, డీజిల్ వేరియంట్లు, ధరల వివరాలు వెల్లడి కొత్త 2014 హోండా సిటీ మొత్తం 12 వేరియంట్లలో (7 పెట్రోల్ వేరియంట్లు, 5 డీజిల్ వేరియంట్లు) లభ్యం కానుంది.


Click it and Unblock the Notifications








