హోండా బ్రయో, అమేజ్‌లలో కొత్త టాప్-ఎండ్ వేరియంట్స్ విడుదల

By Ravi

జపనీస్ కార్ కంపెనీ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్, దేశీయ విపణిలో విక్రయిస్తున్న బ్రయో హ్యాచ్‌బ్యాక్, అమేజ్ కాంపాక్ట్ సెడాన్లలో కంపెనీ నేడు రెండు కొత్త వేరియంట్లను మార్కెట్లో విడుదల చేసింది.

హోండా అమేజ్ విఎక్స్ (ఆప్షనల్) పేరుతో విడుదలైన ఈ కొత్త వేరియంట్లో ఆడియో-వీడియో నావిగేషన్ ఫీచర్ ఉంటుంది. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న అమేజ్ విఎక్స్ వేరియంట్‌కు ఎగువన ఈ కొత్త అమేజ్ విఎక్స్ (ఆప్షనల్) వేరియంట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది పెట్రోల్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది.

Amaze

అలాగే.. హోండా బ్రయో విఎక్స్ పేరిట కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త వేరియంట్‌లో ఆడియో-వీడియో నావిగేషన్ సిస్టమ్ లభిస్తుంది. ఇంకా ఇందులో స్ట్రైకింగ్ బ్లాక్ కలర్ ఇంటీరియర్స్‌ను ఆఫర్ చేస్తున్నారు. కాగా.. ఇంజన్ పరంగా ఈ రెండు టాప్-ఎండ్ వేరియంట్లలో ఎలాంటి మార్పులు లేవు.

ఇకపోతే.. ఈ కొత్త బ్రయో, అమేజ్ వేరియంట్లలో అడ్వాన్స్డ్ వైట్ ఇల్యుమినేషన్ స్పీడోమీటర్ విత్ బ్లూ గ్రడేషన్ మరియు కొత్తగా డిజైన్ చేసిన పవర్ ఫోల్డబిల్ సైడ్ మిర్రర్స్ ఫీచర్లు కూడా లభ్యం కానున్నాయి. అమేజ్ ఎస్ఎక్స్ వేరియంట్ నుంచే పవర్ ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్, రియర్ డిఫాగ్గర్ ఫీచర్లు లభ్యం కానున్నాయి.

Brio

ఈ టాప్-ఎండ్ వేరియంట్లలో హోండా పరిచయం చేస్తున్న ఆడియో వీడియో నావిగేషన్ సిస్టమ్ 15.7 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉండి మ్యాప్స్, శాటిలైట్ ఆధారిత వాయిస్ గైడెడ్ నావిగేషన్‌ను సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా.. డివిడి, సిడి, బ్లూటూత్, యూఎస్‌బి, ఆక్స్, ఐ-పాడ్, ఎమ్‌పి3, ఎఫ్/ఏఎమ్ కనెక్టివిటీలతో ఓ పూర్తి ఇన్-కార్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా కూడా పనిచేస్తుంది.

దేశీయ విపణిలో హోండా బ్రయో, అమేజ్ కొత్త వేరియంట్ల వివరాలు ఇలా ఉన్నాయి:

  • హోండా బ్రయో విఎక్స్ బిఎల్ మ్యాన్యువల్ - రూ.5.99 లక్షలు (పెట్రోల్)
  • హోండా బ్రయో విఎక్స్ బిఎల్ ఆటోమేటిక్ - రూ.6.78 లక్షలు (పెట్రోల్)
  • హోండా అమేజ్ విఎక్స్ మ్యాన్యువల్ (ఆప్షనల్) - రూ.7.32 లక్షలు (పెట్రోల్)
  • హోండా అమేజ్ విఎక్స్ మ్యాన్యువల్ (ఆప్షనల్) - రూ.8.20 లక్షలు (డీజిల్)

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Tuesday, January 13, 2015, 13:05 [IST]
English summary
Honda Cars India Ltd. (HCIL), leading manufacturer of premium cars in India, today introduced the new enriched range of Honda Amaze and Honda Brio. The Amaze comes with a new VX(O) grade featuring the Audio-Video Navigation. The new grade will be positioned above the existing VX grade in Manual Transmission in both petrol and diesel. The Brio range has also been expanded by introducing a new VX grade with striking Black Interiors and Audio-Video Navigation.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+