ఇండోనేషియాలో స్పోర్టీ హోండా మొబిలియో ఆర్ఎస్ విడుదల!

By Ravi

జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా లేటెస్ట్ ప్రోడక్ట్ మొబిలియో ఎమ్‌పివి ఇప్పటికే ఇండోనేషియా మార్కెట్లో విడుదలై హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, హోండా మొబిలియోకి లభిస్తున్న స్పందనను చూసిన హోండా, ఇందులో మొబిలియో ఆర్ఎస్ పేరిట ఓ స్పోర్టీ వెర్షన్‌ను అక్కడి మార్కెట్లో విడుదల చేసింది.

హోండా మొబిలియో ఆర్ఎస్ రెగ్యులర్ మోడల్ కన్నా భిన్నంగా, స్పోర్టీగా ఉంటుంది. రెగ్యులర్ మొబిలియోకి అదనపు స్పోర్టీ బాడీ కిట్‌ను జోడించి మొబిలియో ఆర్ఎస్ పేరిట హోండా ఈ కొత్త వేరియంట్‌ను విక్రయిస్తోంది. ఇండోనేషియా మార్కెట్లో ఇప్పటికే 35,000 యూనిట్లకు పైగా హోండా మొబిలియో ఎమ్‌పివిలు అమ్ముడుపోయాయి.


కాగా.. ఈ కొత్త హోండా మొబిలియో ఆర్ఎస్ వేరియంట్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది. కొత్త బంపర్, కొత్త గ్రిల్, కొత్త హెడ్‌లైట్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ వంటి అనేక కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌ను ఈ మోడల్‌లో చూడొచ్చు. స్టయిలిష్ బాడీ కిట్, రూఫ్ స్పాయిలర్, బ్లాక్ ఇంటీరియర్స్, ఇంప్రూవ్డ్ సిస్టమ్ వంటి అనేక ఫీచర్లు మొబిలియో ఆర్ఎస్ సొంతం.

ఇండోనేషియా మార్కెట్లో సివిటి ఆటోమేటిక్ వెర్షన్ హోండా మొబిలియో ఆర్ఎస్ ధర 214 మిలియన్ ఐడిఆర్ (మనదేశ కరెన్సీలో సుమారు 10.76 లక్షలు)లు గాను, మ్యాన్యువల్ వెర్షన్ హోండా మొబిలియో ఆర్ఎస్ ధర 203.5 మిలియన్ ఐడిఆర్ (మనదేశ కరెన్సీలో సుమారు 10.23 లక్షలు)గాను ఉన్నాయి.

Honda Launches Sporty Mobilio RS In Indonesia

ఇదిలా ఉండగా.. హోండా కార్స్ ఇండియా జూలై 2014లో తమ మొబిలియో ఎమ్‌పివిని భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో, హోండా మొబిలియో ఆర్ఎస్ వేరియంట్ కూడా ఈ ఏడాది చివరి నాటికి మనదేశ మార్కెట్లో కూడా లభ్యమయ్యే అకాశాలు కనిపిస్తున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, June 21, 2014, 10:17 [IST]
English summary
The yet-to-launch Honda Mobilio is doing very well in Indonesia. The Japanese carmaker has so far racked up sales of over 35,000 units of the Brio-based people mover. Going by this impressive response from buyers, they have added another variant called the RS to their Mobilio variant line up.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+