భారత్‌లో హోండా మొబిలియో ఆర్ఎస్ స్పోర్ట్ వెర్షన్!
జపనీస్ ఆటోమొబైల్ కంపెనీ హోండా తమ మొబిలియో ఎమ్‌పివిని మరికొద్ది రోజుల్లో భారత మార్కెట్లో విడుదల చేయనున్న సంగతి తెలిసినదే. ఈ మోడల్ ఇప్పటికే ఇండోనేషియా మార్కెట్లో విడుదలైంది. అక్కడి మార్కెట్ కోసం హోండా ఇందులో 'మొబిలియో ఆర్ఎస్' (Mobilio RS) పేరిట ఓ స్పోర్టీ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ స్పోర్టీ వెర్షన్ హోండా మొబిలియో ఆర్ఎస్ భారత మార్కెట్లో కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
రెగ్యులర్ హోండా మొబిలియోతో పోల్చుకుంటే ఈ హోండా మొబిలియో ఆర్ఎస్ మరింత స్పోర్టీగా ఉంటుంది. రెగ్యులర్ మొబిలియో టాప్-ఎండ్ వేరియంట్‌కి అదనపు స్పోర్టీ బాడీ కిట్‌ను జోడించి మొబిలియో ఆర్ఎస్‌గా తీర్చిదిద్దారు. కొత్త బంపర్, కొత్త గ్రిల్, కొత్త హెడ్‌లైట్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ వంటి అనేక కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌ను ఈ మోడల్‌లో చూడొచ్చు. స్టయిలిష్ బాడీ కిట్, రూఫ్ స్పాయిలర్, బ్లాక్ ఇంటీరియర్స్, ఇంప్రూవ్డ్ సిస్టమ్ వంటి అనేక ఫీచర్లు మొబిలియో ఆర్ఎస్ సొంతం.

ఇంకా.. 6.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమరా, డ్యాష్‌బోర్డ్‌పై ఫాక్స్‌వుడ్ ట్రిమ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. కాగా.. హోండా కార్స్ ఇండియా జూలై 23, 2014వ తేదీన తమ మొబిలియో ఎమ్‌పివిని భారత మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. మొబిలియో ఓ 7-సీటర్ (2+3+2) ఎమ్‌పివి. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది.
పెట్రోల్ వెర్షన్‌లో 1.5 లీటర్, 4-సిలిండర్ ఐ-విటెక్ ఇంజన్‌ను అమర్చనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6600 ఆర్‌పిఎమ్ వద్ద 117 బిహెచ్‌పిల శక్తిని, 4600 ఆర్‌పిఎమ్ వద్ద 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ వెర్షన్ అందుబాటులో లేనట్లు సమాచారం.

డీజిల్ వెర్షన్‌లో 1.5 లీటర్, 4-సిలిండర్ ఐ-డిటెక్ ఇంజన్‌ను అమర్చనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3600 ఆర్‌పిఎమ్ వద్ద 98 బిహెచ్‌పిల శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే లభిస్తుంది. ఇందులో కూడా ఆటోమేటిక్ వెర్షన్ అందుబాటులో లేదు. దేశీయ విపణిలో దీని ప్రారంభ ధర రూ.5.90 లక్షలు ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








