హోండా జాజ్ విడుదల తర్వాత, హోండా మొబిలియో విడుదల
డీజిల్ కార్ల విడుదలతో భారత మార్కెట్లో మాంచి జోరుమీదున్న జపనీస్ కార్ కంపెనీ హోండా కార్స్ ఇండియా, ఈ ఏడాదిలో మరో రెండు కొత్త మోడళ్లను మార్కెట్ పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వాస్తవానికి 2015లో విడుదల చేయాలనుకున్న నెక్స్ట్ జనరేషన్ జాజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను 2014లో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.
అంతేకాకుండా, కొత్త జాజ్‌తో పాటుగా హోండా మొబిలియో ఎమ్‌పివిని కూడా కంపెనీ భారత్‌లో విడుదల చేయనుంది. జాజ్‌ను విడుదల చేసిన కొద్ది రోజులకే కొత్త మొబిలియో కూడా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పటికే హోండా మొబిలియో ఎమ్‌పివి ఉత్పత్తి గ్రేటర్ నోయిడాలోని ప్లాంట్‌లో ప్రారంభమైంది.

ఈ ప్లాంట్‌లో సాలీనా 45,000 మొబిలియో ఎమ్‌పివిలు ఉత్పత్తి కానున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో హోండా మొబిలియో మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా. ఇకపోతే హోండా జాజ్ ఉత్పత్తి ఈ ఏడాది జులై ఆరంభంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. మొత్తమ్మీ ఈ పండుగ సీజన్ నాటికి హోండా తమ కస్టమర్లకు సరికొత్త కార్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

హోండా జాజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను రాజస్థాన్‌లోని తపుకరా ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంట్‌లో సాలీనా 20,000 యూనిట్ల జాజ్ హ్యాచ్‌బ్యాక్‌లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ రెండు కార్లు కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానున్నాయి. పెట్రోల్ వెర్షన్‌లో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కూడా అందుబాటులోకి రానుంది.
DON'T MISS: FACEBOOK VIDEO OF THE DAY


Click it and Unblock the Notifications








