అఫీషియల్: జులై 2014లో హోండా మొబిలియో ఎమ్‌పివి విడుదల

By Ravi

అఫీషియల్.. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హోండా మొబిలియో ఎమ్‌పివి జులై 2014 నెలలో మార్కెట్లో వాణిజ్య పరంగా విడుదల చేయనున్నట్లు హోండా కార్స్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఇండోనేషియా మార్కెట్లో హోండా మొబిలియో విడుదలైంది. బ్రయో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన మొబిలియో ఎమ్‌పివిని హోండా తొలిసారిగా గడచిన ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన సంగతి తెలిసినదే.

హోండా కార్స్ ఇండియా ఇప్పటికే గ్రేటర్ నోయిడాలోని ప్లాంట్‌లో మొబిలియో ఎమ్‌పివి ట్రైల్ ప్రొడక్షన్‌ను విజయవంతంగా నిర్వహించింది. భారత్‌లో హోండా సిటీ తర్వాత ఇదే పెద్ద విడుదల కానుంది. ప్రస్తుతం ఎమ్‌పివి సెగ్మెంట్లో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, హోండా మాత్రం తమ బ్రయో విషయంలో ఆశాభావంతో వ్యవహరిస్తోంది. ఈ మోడల్ విడుదలతో కంపెనీ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది.

Honda Mobilio

హోండా మొబిలియో 7-సీటర్ ఆప్షన్‌తో ఈ సెగ్మెంట్లో నేరుగా మారుతి సుజుకి ఎర్టిగా, షెవర్లే ఎంజాయ్ వంటి ఎమ్‌పివిలకు పోటీగా నిలువనుంది. మొబిలియోను బ్రయో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు కాబట్టి, దీనిని ముందు వైపు నుంచి చూస్తే ఇది బ్రయో మాదిరిగానే అనిపిస్తుంది. ప్రస్తుతం కొత్త తరం హోండా సిటీ సెడాన్‌లో ఉపయోగిస్తున్న పెట్రోల్, డీజిల్ ఇంజన్లనే ఈ కొత్త మొబిలియోలోను ఉపయోగించనున్నారు.

పెట్రోల్ వెర్షన్‌లో 1.5 లీటర్, 4-సిలిండర్ ఐ-విటెక్ ఇంజన్‌ను అమర్చనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 116 బిహెచ్‌పిల శక్తిని, 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్‌లో 1.5 లీటర్, 4-సిలిండర్ ఐ-డిటెక్ ఇంజన్‌ను అమర్చనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 97 బిహెచ్‌పిల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ.5.90 లక్షలు ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, May 23, 2014, 13:12 [IST]
English summary
Honda has officially confirmed that it will launch the Mobilio MPV in India during the month of July. The long awaited Mobilio will be the company's second launch this year after the City, which was introduced in January.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+