హైదరాబాద్‌లో మొబిలియో విడుదల; ధర రూ.6.80 లక్షలు

By Ravi

జపనీస్ ఆటోమొబైల్ బ్రాండ్ హోండా కార్స్ ఇండియా ఇటీవల దేశీయ విపణిలో విడుదల చేసిన తమ మొట్టమొదటి ఎమ్‌పివి (మల్టీ పర్సస్ వెహికల్) 'హోండా మొబిలియో' (Honda Mobilio) కంపెనీ తాజాగా రాష్ట్ర మార్కెట్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్ర విపణిలో హోండా మొబిలియో ప్రారంభ ధర రూ.6.80 లక్షలు (ఎక్స్-షోరూమ్. హైదరాబాద్)గా ఉంది.

హోండా మొబిలియో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం అవుతుంది. ఈ మోడల్‌కు ఇప్పటికే 10,000ల యూనిట్లకు పైగా బుకింగ్స్ వచ్చాయని, మొబీలియో వచ్చే స్పందనను బట్టి రాజస్థాన్ ప్లాంటులో రెండో షిఫ్ట్ ప్రారంభిస్తామని హోండా కార్స్ ఇండియా జనరల్ అఫైర్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రమణ్‌కుమార్ శర్మ తెలిపారు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

హైదరాబాద్‌లో మొబిలియో విడుదల

హోండా మొబిలియో ఎమ్‌పివికి సంబంధించిన మరిన్ని వివరాలను తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకోండి.

పెట్రోల్ ఇంజన్

పెట్రోల్ ఇంజన్

పెట్రోల్ వెర్షన్‌లో 1.5 లీటర్, 4-సిలిండర్ ఐ-విటెక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6600 ఆర్‌పిఎమ్ వద్ద 119 పిఎస్‌ల శక్తిని, 4600 ఆర్‌పిఎమ్ వద్ద 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

డీజిల్ ఇంజన్

డీజిల్ ఇంజన్

డీజిల్ వెర్షన్‌లో 1.5 లీటర్, 4-సిలిండర్ ఐ-డిటెక్ ఇంజన్‌ను అమర్చనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3600 ఆర్‌పిఎమ్ వద్ద 98 బిహెచ్‌పిల శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే లభిస్తుంది.

మైలేజ్ (పెట్రోల్, డీజిల్)

మైలేజ్ (పెట్రోల్, డీజిల్)

హోండా మొబిలియో డీజిల్ లీటరుకు 24.2 కిలోమీటర్ల మైలేజీని మరియు పెట్రోల్ వెర్షన్ లీటరుకు 17.3 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

 స్పోర్టీ మొబిలియో ఆర్ఎస్

స్పోర్టీ మొబిలియో ఆర్ఎస్

హోండా మొబిలియోలో స్టయిలిష్ స్పోర్టీ వేరియంట్‌ను కోరుకునే వారి కోసం కంపెనీ ఇందులో మొబిలియో ఆర్ఎస్ పేరిట ఓ కొత్త వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఈ వేరియంట్‌లో ప్రొజెక్టర్ ల్యాంప్స్, ఎల్ఈడి పొజిషనింగ్ ల్యాంప్స్ వంటి ప్రీమియం ఫీచర్లుంటాయి. ఇదికేవలం డీజిల్ వెర్షన్లో మాత్రమే లభ్యం కానుంది. అయితే, ఇది అందుబాటులోకి రావటానికి మరో 3 నెలల సమయం పడుతుంది. సెప్టెంబర్ నుంచి దీని డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

పెట్రోల్ వెర్షన్ ధరలు

పెట్రోల్ వెర్షన్ ధరలు

హోండా మొబిలియో ఈ - రూ.6.80 లక్షలు

హోండా మొబిలియో ఎస్ - రూ.7.83 లక్షలు

హోండా మొబిలియో వి - రూ.9.06 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

డీజిల్ వెర్షన్ ధరలు

డీజిల్ వెర్షన్ ధరలు

హోండా మొబిలియో ఈ - రూ.8.24 లక్షలు

హోండా మొబిలియో ఎస్ - రూ.8.97 లక్షలు

హోండా మొబిలియో వి - రూ.10.18 లక్షలు

హోండా మొబిలియో ఆర్ఎస్ - రూ.11.30 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

More from DriveSpark

Article Published On: Tuesday, August 5, 2014, 18:30 [IST]
English summary
Japanese carmaker Honda Cars India has launched its first MPV the Mobilio in Hyderabad at a starting price of Rs 6.80 lakh for the petrol variant and Rs 8.24lakh for the diesel variant (all prices are ex-showroom, Hyderabad).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+