హోండా మొబిలియో విడుదల; ధర రూ.6.49 లక్షలు

By Ravi

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎమ్‌పివి (మల్టీ పర్సస్ వెహికల్) సెగ్మెంట్లో సునామీ సృష్టించేందుకు హోండా సిద్ధమైంది. బ్రయో ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన 'హోండా మొబిలియో' (Honda Mobilio) ఎమ్‌పివిని కంపెనీ నేడు (జులై 23, 2014) మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో హోండా మొబిలియో ప్రారంభ ధర రూ.6.49 లక్షలు (ఎక్స్-షోరూమ్. ఢిల్లీ)గా ఉంది.

పెద్ద కుటుంబాలను టార్గెట్ చేసుకొని హోండా ప్రవేశపెట్టిన ఈ ఫ్యామిలీ కారులో 7 సీట్లు (2+3+2) ఉంటాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, హోండా మొబిలియో పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభ్యం కానుంది. డీజిల్ కార్ సెగ్మెంట్లోకి హోండా లేటుగా ప్రవేశించినప్పటికీ, తమ లేటెస్ట్ ఎర్త్‌డ్రీమ్స్ ఇంజన్‌తో ఇప్పటికే మార్కెట్లో అద్భుతాలు సృష్టిస్తోంది.

హోండా మొబిలియోకి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

హోండా మొబిలియో విడుదల

మొబిలిటీ, మొబైల్ అనే రెండు ఆంగ్ల అక్షరాల నుంచి ఈ కారుకు మొబిలియో అనే పేరు పెట్టారు. నేటి నుంచే ఈ మోడల్ డెలివరీలను ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది. ఇంజన్, మైలేజ్, ధరల వివరాలను తర్వాతి స్లైడ్‌లలో చూడండి.

పెట్రోల్ ఇంజన్

పెట్రోల్ ఇంజన్

పెట్రోల్ వెర్షన్‌లో 1.5 లీటర్, 4-సిలిండర్ ఐ-విటెక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6600 ఆర్‌పిఎమ్ వద్ద 119 పిఎస్‌ల శక్తిని, 4600 ఆర్‌పిఎమ్ వద్ద 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

డీజిల్ ఇంజన్

డీజిల్ ఇంజన్

డీజిల్ వెర్షన్‌లో 1.5 లీటర్, 4-సిలిండర్ ఐ-డిటెక్ ఇంజన్‌ను అమర్చనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3600 ఆర్‌పిఎమ్ వద్ద 98 బిహెచ్‌పిల శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే లభిస్తుంది.

మైలేజ్ (పెట్రోల్, డీజిల్)

మైలేజ్ (పెట్రోల్, డీజిల్)

హోండా మొబిలియో డీజిల్ లీటరుకు 24.2 కిలోమీటర్ల మైలేజీని మరియు పెట్రోల్ వెర్షన్ లీటరుకు 17.3 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

స్పోర్టీ మొబిలియో ఆర్ఎస్

స్పోర్టీ మొబిలియో ఆర్ఎస్

హోండా మొబిలియోలో స్టయిలిష్ స్పోర్టీ వేరియంట్‌ను కోరుకునే వారి కోసం కంపెనీ ఇందులో మొబిలియో ఆర్ఎస్ పేరిట ఓ కొత్త వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఈ వేరియంట్‌లో ప్రొజెక్టర్ ల్యాంప్స్, ఎల్ఈడి పొజిషనింగ్ ల్యాంప్స్ వంటి ప్రీమియం ఫీచర్లుంటాయి. ఇదికేవలం డీజిల్ వెర్షన్లో మాత్రమే లభ్యం కానుంది. అయితే, ఇది అందుబాటులోకి రావటానికి మరో 3 నెలల సమయం పడుతుంది. సెప్టెంబర్ నుంచి దీని డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

పెట్రోల్ వెర్షన్ ధరలు

పెట్రోల్ వెర్షన్ ధరలు

హోండా మొబిలియో ఈ - రూ.6.49 లక్షలు

హోండా మొబిలియో ఎస్ - రూ.7.50 లక్షలు

హోండా మొబిలియో వి - రూ.8.76 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

డీజిల్ వెర్షన్ ధరలు

డీజిల్ వెర్షన్ ధరలు

హోండా మొబిలియో ఈ - రూ.7.89 లక్షలు

హోండా మొబిలియో ఎస్ - రూ.8.60 లక్షలు

హోండా మొబిలియో వి - రూ.9.76 లక్షలు

హోండా మొబిలియో ఆర్ఎస్ - రూ.10.86 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

హోండా మొబిలియో విడుదల

కొత్త హోండా మొబిలియోకి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 23, 2014, 14:10 [IST]
English summary
Japanese carmaker Honda Cars India has officially launched its first MPV the Mobilio at a starting price of Rs 6.49 lakh for the petrol variant and Rs 7.89 lakh for the diesel variant (all prices are ex-showroom, Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+