మార్చి 2014లో హోండా మొబిలో ఉత్పత్తి ప్రారంభం
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ అందిస్తున్న చిన్న కారు 'బ్రయో' హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ అభివృద్ధి చేసిన బహుళ ప్రయోజన వాహన (ఎమ్‌పివి- మల్టీ పర్పస్ వెహికల్) 'హోండా మొబిలో' (Honda Mobilo) వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెల నాటికి భారత మార్కెట్లో విడుదల కానుంది. ఈ మేరకు, మార్చ్ 2014 నుంచి రాజస్థాన్‌లోని తపుకరా వద్ద హోండా కొత్తగా ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో హోండా తమ మొబిలోను వాణిజ్య పరంగా ఉత్పత్తి చేయనుంది.
భారత్‌లో ఉత్పత్తి చేసిన హోండా మొబిలో ఎమ్‍పివిని పొరుగు దేశాలకు కూడా కంపెనీ ఎగుమతి చేసే ఆస్కారం ఉంది. హోండా తొలిసారిగా బ్రయో ఎమ్‌పివి సెప్టెంబర్ నెలలో ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన అంతర్జాతీయ ఆటో షోలో ఆవిష్కరించింది. ఈ మోడల్‌ను థాయ్‌లాండ్, జపాన్‌లోల అభివృద్ధి చేశారు. హోండా మొబిలో పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభ్యం కానుంది.
హోండో మొబిలో ఎమ్‌పివికి సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

కొలతలు
హోండా మొబిలో కాంపాక్ట్ డిజైన్ కలిగిన ఓ ఫుల్‌సైజ్ ఎమ్‌పివి. లోపలి వైపు ప్రయాణికులకు పూర్థిస్థాయి సౌకర్యాన్ని అందించేలా హోండా ఇంజనీర్లు ఈ ఎమ్‌పివిని డిజైన్ చేశారు. దీని కొలతలు ఇలా ఉన్నాయి.
పొడవు: 4,390 మి.మీ.
వెడల్పు: 1,680 మి.మీ.
ఎత్తు: 1,610 మి.మీ.
వీల్‌బేస్: 2,650 మి.మీ.
గ్రౌండ్ క్లియరెన్స్: 185 మి.మీ.
టర్నింగ్ రేడియస్: 5.2 మీటర్లు

డిజైన్
బ్రయో, అమేజ్‌లను డిజైన్‌ను చేసిన ప్లాట్‌ఫామ్ మీదనే మొబిలోను కూడా డిజైన్ చేశారు. అయితే, మొబిలో వీల్‌బేస్ అలాగే గ్రౌండ్ క్లియరెన్స్‌లు అమేజ్ కన్నా ఎక్కువగా ఉంటాయి. ముందు వైపు డిజైన్‌ను గమనిస్తే, ఇది బ్రయో, అమేజ్‌ల మాదిరిగానే కనిపిస్తుంది. మిగిలిన భాగాన్ని ప్రత్యేకించి పై భాగం మరియు వెనుక భాగాలను కొత్తగా డిజైన్ చేశారు.

ఇంజన్
ప్రారంభంలో భాగంగా, హోండా మొబిలో పెట్రోల్ వెర్షన్‌లో విడుదల కానుంది. ఇందులో 1.5 లీటర్ ఎస్ఓహెచ్‌సి, ఐ-విటెక్, 14-వాల్వ్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది గరిష్టంగా 118 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే, భారత్ వంటి దేశాల కోసం ఇందులో డీజిల్ వెర్షన్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అమేజ్ డీజిల్‌లో ఉపయోగించిన ఇంజన్‌నే కాస్తంత రీట్యూన్ చేసి హోండా మొబిలో ఎమ్‌పివిలో కూడా ఉపయగించే ఆస్కారం ఉంది.

ట్రాన్సిమిషన్
పెట్రోల్ వెర్షన్ హోండా మొబిలో ఎమ్‌పివిలో రెండు రకాల ట్రాన్సిమిన్లు (5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, సివిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్) అందుబాటులో ఉండనుంది. డీజిల్ వెర్షన్‌లో మాత్రం కేవలం మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ మాత్రమే అందుబాటులో ఉంటుందని అంచనా.

సేఫ్టీ ఫీచర్లు
హోండా మొబిలో ఎమ్‌పివి అధునాత సేఫ్టీ ఫీచర్లతో లభ్యం కానుంది. ఇందులో ప్రధానంగా జి-కాన్ (జి-ఫోర్స్ కంట్రోల్ టెక్నాలజీ), ఏసిఈటిఎమ్, ఏబిఎస్, ఈబిడి బ్రేకింగ్ సిస్టమ్, డ్యూయెల్ ఫ్రంట్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్, ప్రీటెన్షనర్ సీట్ బెల్ట్స్ విత్ లోడ్ లిమిటర్, ఇంపాక్ట్ మిటిగేటింగ్ హెడ్ రెస్ట్స్, సెర్టా పెడస్టేరియన్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.

ధర
హోండా మొబిలో ఎమ్‌పివి తొలుతగా ఇండోనేషియన్ మార్కెట్లో విడుదల కానుంది. అక్కడి మార్కెట్లో దీని ధర 150-180 మిలియన్ రుపయ్య (మన దేశ కరెన్సీలో సుమారు రూ.8.41 లక్షల నుంచి 10.09 లక్షల మధ్యలో) ఉండొచ్చని అంచనా.

2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పో
వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో జరగబోయే 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో హోండా తమ మొబిలో ఎమ్‌పివిని భారత్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








