హోండా మొబిలో ఎమ్‌పివి ఆవిష్కరణ; తర్వరలో విడుదల

By Ravi

జపనీస్ కార్ కంపెనీ హోండా అందిస్తున్న చిన్న కారు 'బ్రయో' హ్యాచ్‌‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఇందులో ఎమ్‌పివి (మల్టీ పర్పస్ వెహికల్)ని విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు తాజాగా హోండా ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరగనున్న అంతర్జాతీయ ఆటో షోకు కొద్ది రోజుల ముందుగానే తమ బ్రయో ఆధారిత ఎమ్‌పివిని ఆవిష్కరించింది.

హోండా ఈ ఎమ్‌పివికి 'మొబిలో' (Mobilio) అనే పేరును ఖరారు చేసింది. డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి ఆవిష్కృతమైన ఒక్క రోజు తర్వాతనే ఈ కొత్త హోండా మొబిలో ఎమ్‌పివిని ఆవిష్కరించడం గమనార్హం. బ్రయో ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అమేజ్ సెడాన్‌ను రూపొందించినట్లుగా ఈ మొబిలో ఎమ్‌పివిని కూడా రూపొందించారు. అత్యున్న నాణ్యతా ప్రమాణాలు, స్పోర్టీ పెర్ఫామెన్స్‌లతో మొబిలోను తీర్చిదిద్దామని హోండా పేర్కొంది.

హోండో మొబిలో ఎమ్‌పివికి సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

కొలతలు

కొలతలు

హోండా మొబిలో కాంపాక్ట్ డిజైన్ కలిగిన ఓ ఫుల్‌సైజ్ ఎమ్‌పివి. లోపలి వైపు ప్రయాణికులకు పూర్థిస్థాయి సౌకర్యాన్ని అందించేలా హోండా ఇంజనీర్లు ఈ ఎమ్‌పివిని డిజైన్ చేశారు. దీని కొలతలు ఇలా ఉన్నాయి.

పొడవు: 4,390 మి.మీ.

వెడల్పు: 1,680 మి.మీ.

ఎత్తు: 1,610 మి.మీ.

వీల్‌బేస్: 2,650 మి.మీ.

గ్రౌండ్ క్లియరెన్స్: 185 మి.మీ.

టర్నింగ్ రేడియస్: 5.2 మీటర్లు

డిజైన్

డిజైన్

బ్రయో, అమేజ్‌లను డిజైన్‌ను చేసిన ప్లాట్‌ఫామ్ మీదనే మొబిలోను కూడా డిజైన్ చేశారు. అయితే, మొబిలో వీల్‌బేస్ అలాగే గ్రౌండ్ క్లియరెన్స్‌లు అమేజ్ కన్నా ఎక్కువగా ఉంటాయి. ముందు వైపు డిజైన్‌ను గమనిస్తే, ఇది బ్రయో, అమేజ్‌ల మాదిరిగానే కనిపిస్తుంది. మిగిలిన భాగాన్ని ప్రత్యేకించి పై భాగం మరియు వెనుక భాగాలను కొత్తగా డిజైన్ చేశారు.

ఇంజన్

ఇంజన్

ప్రారంభంలో భాగంగా, హోండా మొబిలో పెట్రోల్ వెర్షన్‌లో విడుదల కానుంది. ఇందులో 1.5 లీటర్ ఎస్ఓహెచ్‌సి, ఐ-విటెక్, 14-వాల్వ్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది గరిష్టంగా 118 పిఎస్‌‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే, భారత్ వంటి దేశాల కోసం ఇందులో డీజిల్ వెర్షన్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అమేజ్ డీజిల్‌లో ఉపయోగించిన ఇంజన్‌నే కాస్తంత రీట్యూన్ చేసి హోండా మొబిలో ఎమ్‌పివిలో కూడా ఉపయగించే ఆస్కారం ఉంది.

ట్రాన్సిమిషన్

ట్రాన్సిమిషన్

పెట్రోల్ వెర్షన్ హోండా మొబిలో ఎమ్‌పివిలో రెండు రకాల ట్రాన్సిమిన్లు (5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, సివిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్) అందుబాటులో ఉండనుంది.

సేఫ్టీ ఫీచర్లు

సేఫ్టీ ఫీచర్లు

హోండా మొబిలో ఎమ్‌పివి అధునాత సేఫ్టీ ఫీచర్లతో లభ్యం కానుంది. ఇందులో ప్రధానంగా జి-కాన్ (జి-ఫోర్స్ కంట్రోల్ టెక్నాలజీ), ఏసిఈటిఎమ్, ఏబిఎస్, ఈబిడి బ్రేకింగ్ సిస్టమ్, డ్యూయెల్ ఫ్రంట్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్, ప్రీటెన్షనర్ సీట్ బెల్ట్స్ విత్ లోడ్ లిమిటర్, ఇంపాక్ట్ మిటిగేటింగ్ హెడ్ రెస్ట్స్, సెర్టా పెడస్టేరియన్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.

ధర

ధర

హోండా మొబిలో ఎమ్‌పివి తొలుతగా ఇండోనేషియన్ మార్కెట్లో విడుదల కానుంది. అక్కడి మార్కెట్లో దీని ధర 150-180 మిలియన్ రుపయ్య (మన దేశ కరెన్సీలో సుమారు రూ.8.41 లక్షల నుంచి 10.09 లక్షల మధ్యలో) ఉండొచ్చని అంచనా.

2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పో

2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పో

వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో జరగబోయే 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో హోండా తమ మొబిలో ఎమ్‌పివిని భారత్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, September 19, 2013, 16:20 [IST]
English summary
In quick succession two automakers have unveiled their respective MPVs in Indonesia. While Nissan revealed the Datsun GO+ just ahead of the auto show in Jakarta, Honda decided to wait till the auto show to unveil its Brio based MPV concept - Honda Mobilio.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+