సెప్టెంబర్ 2014లో హోండా మొబిలియో ఆర్ఎస్ డెలివరీలు

హోండా కార్స్ ఇండియా తమ మొట్టమొదటి ఎమ్‌పివి 'మొబిలియో' (Mobilio)ని నేడు (జులై 23, 2014) భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. అయితే, ఇందులో స్టయిలిష్ స్పోర్టీ వేరియంట్‌ను కోరుకునే వారి కోసం కంపెనీ మొబిలియో ఆర్ఎస్ పేరిట కేవలం డీజిల్ వెర్షన్‌లో మాత్రమే ఓ టాప్-ఎండ్ వేరియంట్‌ను ఆఫర్ చేస్తోంది.

ఇది కూడా చదవండి: హోండా మొబిలియో ధరలు, వేరియంట్లు

హోండా మొబిలియో ఆర్ఎస్ రెగ్యులర్ వేరియంట్ల కన్నా భిన్నంగా, స్పోర్టీగా ఉంటుంది. రెగ్యులర్ హోండా మొబిలియోకి అదనపు స్పోర్టీ బాడీ కిట్‌ను జోడించి మొబిలియో ఆర్ఎస్ అనే పేరుతో ఈ కొత్త వేరియంట్‌ను విక్రయించనున్నారు. ఈ మోడల్ ఇప్పటికే ఇండోనేషియా మార్కెట్లో ఇప్పటికే విడుదలై మంచి సక్సెస్‌ను సాధించింది. మనదేశంలో మొబిలియో ఆర్ఎస్ డెలివరీలు సెప్టెంబర్ 2014 నుంచి ప్రారంభం కానున్నాయి.


మొబిలియో ఆర్ఎస్ వేరియంట్‌లో ప్రొజెక్టర్ ల్యాంప్స్, ఎల్ఈడి పొజిషనింగ్ ల్యాంప్స్, కొత్త బంపర్స్, కొత్త క్రోమ్ గ్రిల్, స్టయిలిష్ బాడీ కిట్, రూఫ్ స్పాయిలర్, పవర్ ఫోల్డింగ్ వింగ్ మిర్రర్స్, బ్లాక్ అండ్ క్రోమ్ 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, క్రోమ్ ఎగ్జాస్ట్, బ్లాక్ ఇంటీరియర్స్ వంటి అనేక కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా అడిషనల్ ఫీచర్లను కూడా ఆఫర్ చేయనున్నారు.

ఇది కూడా చదవండి: మొబిలియోకి చెక్ పెట్టేందుకు మారుతి ఎర్టిగాపై భారీ డిస్కౌంట్స్

హోండా మొబిలియో ఆర్ఎస్ డీజిల్ వేరియంట్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో అదే 1.5 లీటర్, 4-సిలిండర్ ఐ-డిటెక్ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3600 ఆర్‌పిఎమ్ వద్ద 98 బిహెచ్‌పిల శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

Mobilio RS

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం హోండా మొబిలియో డీజిల్ లీటరుకు 24.2 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. భారత మార్కెట్లో హోండా మొబిలియో ఆర్ఎస్ ధర రూ.10.86 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 23, 2014, 17:34 [IST]
English summary
The sporty version Honda Mobilio RS deliveries will commence in September 2014. It is priced at INR 10.86 lakhs (ex-showroom, Delhi). Stay tuned for latest updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+