హోండా మొబిలియో ఆర్ఎస్ అఫీషియల్ ఫొటోలు, వివరాలు

జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ ఇండియా, దేశీయ విపణిలో ఇటీవలే విడుదల తమ మొట్టమొదటి ఎమ్‌పివి 'మొబిలియో' (Mobilio)లో స్టయిలిష్ స్పోర్టీ వేరియంట్‌ను కోరుకునే వారి కోసం 'మొబిలియో ఆర్ఎస్'(Mobilio RS) పేరిట కేవలం డీజిల్ వెర్షన్‌లో మాత్రమే కంపెనీ ఓ టాప్-ఎండ్ వేరియంట్‌ను ఆఫర్ చేయనున్న సంగతి తెలిసినదే.

ఇది కూడా చదవండి: హోండా మొబిలియో ధరలు, వేరియంట్లు

ఈ నేపథ్యంలో, హోండా మొబిలియో ఆర్ఎస్‌లోని ఫీచర్లకు సంబంధించిన అఫీషియల్ ఫోటోలను, వివరాలను కంపెనీ వెల్లడి చేసింది. మొబిలియో ఆర్ఎస్ డెలివరీలు సెప్టెంబర్ 2014 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. అదనపు బాడీ కిట్‌లో లభించే ఫీచర్లను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

హోండా మొబిలియో ఆర్ఎస్

తర్వాతి స్లైడ్‌లలో స్పోర్టీ హోండా మొబిలియో ఆర్ఎస్ వేరియంట్లో లభించే ఫీచర్లు, వివరాలను తెలుసుకోండి.

ప్రొజెక్టర్ ల్యాంప్స్

ప్రొజెక్టర్ ల్యాంప్స్

హోండా మొబిలియో ఆర్ఎస్‌లో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ లభ్యం కానున్నాయి. వీటిపై ఎల్ఈడి పొజిషనింగ్ ల్యాంప్స్ ఉంటాయి. ఇవి కారుకు స్టయిల్‌ను పెంచడమే కాకుండా రోడ్డుపై విజిబిలిటీని పెంచడంలో కూడా సహకరిస్తాయి.

స్టయిలిష్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్

స్టయిలిష్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్

కొత్త మొబిలియో ఆర్ఎస్ స్పోర్టీ వెర్షన్‌లో మరింత స్పోర్టీ అప్పీల్‌ను ఇచ్చేందుకు ఫ్రంట్ బంపర్‌లో బ్లాక్ సరౌండింగ్, బాటమ్‌లో క్రోమ్ ఫినిష్‌తో కూడిన ఫాగ్ ల్యాంప్స్ అమర్చారు. ఇవి కారుకు మరింత స్టయిల్‌ను చేకూర్చుతాయి.

క్రోమ్ గార్నిష్

క్రోమ్ గార్నిష్

మొబిలియో ఆర్ఎస్‌కు ప్రీమియం లుక్‌నిచ్చేందుకు ఇందులో ఎక్కువగా క్రోమ్ ఉపయోగించారు. ముందు వైపు హనీకోంబ్ గ్రిల్‌పై ఏర్పాటు చేసిన క్రోమ్ బార్, దానిపై క్రోమ్ హోండా యాంబ్లం మరింత ప్రీమియంగా కనిపిస్తుంది.

క్రోమ్ డోర్ హ్యాండిల్స్

క్రోమ్ డోర్ హ్యాండిల్స్

ప్రీమియం అప్పీల్‌ను పెంచేందుకు అన్ని డోర్లకు బయటివైపు క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అమర్చారు.

15 ఇంచ్ అల్లాయ్ వీల్స్

15 ఇంచ్ అల్లాయ్ వీల్స్

కొత్త మొబిలియో ఆర్ఎస్ వేరియంట్‌లో బ్లాక్ అండ్ క్రోమ్ 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్ అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. ఇవి కారుకు మరింత స్పోర్టీ అండ్ ప్రీమియం లుక్‌నిస్తాయి.

కొత్త బంపర్స్

కొత్త బంపర్స్

ముందు వైపు మాదిరిగానే వెనుక వైపు కూడా కొత్త బంపర్ కిట్‌ను చూడొచ్చు. బాడీ కలర్డ్ బంపర్‌పై అదనంగా ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ క్లాడింగ్, మరియు దానిపై ఏర్పాటు చేసిన రిఫ్లెక్టర్స్, క్రోమ్ గార్నిష్‌లు స్టయిల్‌గా ఉంటాయి.

సైడ్ మిర్రర్స్ విత్ టర్న్ ఇండికేటర్స్

సైడ్ మిర్రర్స్ విత్ టర్న్ ఇండికేటర్స్

ఇందులో టర్న్ ఇండికేటర్లతో కూడిన ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్ ఫీచర్ లభిస్తుంది. ఇది రాత్రివేళల్లో సేఫ్టీని పెంచడమే కాకుండా, స్టయిలిష్‌గా కూడా అనిపిస్తుంది.

రియర్ రూఫ్ స్పాయిలర్

రియర్ రూఫ్ స్పాయిలర్

హోండా మొబిలియోని రియర్ రూఫ్ స్పాయిలర్ కారుకు మరింత స్టయిల్‌ను చేర్చుతుంది. దీనిపై అమర్చిన హైమౌంట్ బ్రేక్ ల్యాంప్ మరింత సేఫ్టీని ఆఫర్ చేస్తుంది.

హోండా మొబిలియో ఆర్ఎస్

హోండా మొబిలియో ఆర్ఎస్ డీజిల్ వేరియంట్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో అదే 1.5 లీటర్, 4-సిలిండర్ ఐ-డిటెక్ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3600 ఆర్‌పిఎమ్ వద్ద 98 బిహెచ్‌పిల శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

హోండా మొబిలియో ఆర్ఎస్

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం హోండా మొబిలియో డీజిల్ లీటరుకు 24.2 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. భారత మార్కెట్లో హోండా మొబిలియో ఆర్ఎస్ ధర రూ.10.86 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, July 28, 2014, 14:53 [IST]
English summary
Honda Cars India has released official images and details of Mobilio RS MPV. The sporty version Honda Mobilio RS deliveries will commence in September 2014. It is priced at INR 10.86 lakhs (ex-showroom, Delhi). 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+