ఇన్నోవాకు పోటీగా రానున్న హోండా ఫ్రీడ్ ఎమ్‌పివి

By Ravi

హోండా ఫ్రీడ్ ఎమ్‌పివి మళ్లీ తెరపైకి వచ్చింది. హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ విడుదలతో మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్‌కు గట్టి పోటీ ఇచ్చిన హోండా కార్స్ ఇండియా, ఇప్పుడు ఎమ్‌పివి సెగ్మెంట్‌పై కన్నేసింది. ప్రస్తుతం ఎమ్‌‌పివి సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా ఉన్న టొయోటా ఇన్నోవాకు సవాల్ విసిరేందుకు, హోండా నుంచి ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన ఫ్రీడ్ (Freed) ఎమ్‌పివిని ఇండియాకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది.

అయితే, హోండా ఇప్పటికే బ్రయో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని మొబిలో (Mobilo) అనే ఎమ్‌పివిని తయారు చేస్తోంది కదా, మరి అలాంటప్పుడు మరో ఎమ్‌పివిని విడుదల చేయాల్సిన అవసరం ఏంటి అనుకుంటున్నారా..? హోండా మొబిలో ఎమ్‌పివి తక్కువ ధరను కలిగి ఉండి, ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి ఎర్టిగా, షవెర్ల్ ఎంజాయ్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. కానీ హోండా ఫ్రీడ్ మాత్రం ప్రీమియం డిజైన్, ఫీచర్లతో నేరుగా ఇన్నోవాకు పోటీగా నిలువనుంది.

మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

హోండా ఫ్రీడ్

హోండా ఫ్రీడ్ నుంచి ఎదురయ్యే పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు టొయోటా కూడా సిద్ధంగా ఉంది. ఈ ఇరు సంస్థలు నెక్స్ట్ జనరేషన్ ఫ్రీడ్, ఇన్నోవా మోడళ్లను తయారు చేసే పనిలో ఉన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్నారు. మొబిలో విడుదల తర్వాత, ఫ్రీడ్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

హోండా ఫ్రీడ్

హోండా మోటార్స్ '2ఎన్‌హెచ్' అనే కోడ్ నేమ్‌తో డెవలప్ చేస్తున్న ఈ తొలి కాంపాక్ట్ ఎమ్‌పివి 2014 చివరి నాటికి మార్కెట్లోకి రానుంది. నెక్స్ట్-జనరేషన్ జాజ్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని మూడు వరుసలో ఏడు సీట్లు కలిగి ఉండేలా ఈ ఎమ్‌పివిని హోండా అభివృద్ధి చేస్తుంది. ఇప్పటికే ఇతర ఆసియా మార్కెట్లలో ప్రస్తుత హోండా జాజ్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని రూపొందించిన 'ఫ్రీడ్' అనే ఎమ్‌పివిని హోండా విక్రయిస్తోంది.

హోండా ఫ్రీడ్

హోండా '2ఎన్‌హెచ్' కోడ్ నేమ్‌తో అభివృద్ధి చేస్తున్న ఈ నెక్స్ట్-జెన్ ఫ్రీడ్ ఎమ్‌పివి ప్రస్తుతం ఆసియన్ మార్కెట్లలో లభిస్తున్న ఫ్రీడ్ ఎమ్‌పివి కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండనుంది. ప్రస్తుత ఫ్రీడ్‌లో స్లైడింగ్ డోర్స్ ఉండగా, అప్‌గ్రేడెడ్ వెర్షన్‌లో కన్వెన్షనల్ డోర్స్ ఉండనున్నాయి. హోండా కొత్త ఎమ్‌పివి ఇండియాతో పాటుగా ఇండోనేషియాలో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

హోండా ఫ్రీడ్

హోండా ఫ్రీడ్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో లభ్యం కానుంది. పెట్రోల్ వేరియంట్ 2ఎన్‌హెచ్‌ ఎమ్‌పివిలో ప్రస్తుతం అప్‌గ్రేడ్ చేయబడిన హోండా సిటీలో ఉపయోగిస్తున్న 1.5 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ ఐడిటెక్ డీజిల్ ఇంజన్లను కానీ లేదా అంత కన్నా శక్తివంతమైన ఇంజన్లను కానీ ఇందులో ఉపయోగించే అవకాశం ఉంది.

హోండా ఫ్రీడ్

హోండా మోటార్స్ నుండి పాపులర్ అయిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ జాజ్ ఫ్లాట్‌ఫామ్‌పై రూపొందుతున్న ఈ సరికొత్త 2ఎన్‌హెచ్ ఎమ్‌పివి ఇటు స్పేస్ విషయంలోనూ అటు మంచి డ్రైవింగ్ డైనమిక్స్ విషయంలోనూ శభాష్ అనిపించుకోవటం ఖాయం. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, December 20, 2013, 12:36 [IST]
English summary
Japanese carmaker Honda Cars India plans to bring in the next generation of its globally successful MPV Freed to take on the country's best-selling multi-purpose vehicle Toyota Innova by driving in a second utility vehicle in 2016.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+