భారత్‌లో కూడా హోండా అకార్డ్ సెడాన్ రీకాల్

By Ravi

జపనీస్ కార్ కంపెనీ హోండా ప్రపంచ వ్యాప్తంగా విక్రయించిన దాదాపు 20 లక్షలకు పైగా అకార్డ్ సెడాన్లలో ఎయిర్‌బ్యాగ్ సమస్య కారణంగా వాటిని రీకాల్ చేసిన సంగతి తెలిసినదే. అయితే, భారత్‌లో విక్రయించిన అకార్డ్ మోడళ్లు కూడా ఈ రీకాల్‌కు వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది.

గడచిన పదేళ్ల కాలంలో మొదటి ఐదేళ్లలో విక్రయించిన అకార్డ్ మోడళ్లు ఈ రీకాల్‌కు వర్తిస్తాయని హోండా తెలిపింది. రీకాల్ చేయబడిన హోండా అకార్డ్ సెడాన్లలో ఎయిర్‌బ్యాగ్ సమస్యను గుర్తించామని, కొన్ని సందర్భాల్లో ఎయిర్‌బ్యాగ్‌లు పేలిపోయే ప్రమాదం ఉన్నందున వీటిని రీకాల్ చేస్తున్నామని హోండా వివరించింది.

Honda Recall

ఆగస్ట్ 2000 నుంచి 2013 కాలంలో తయారు చేసిన హోండా అకార్డ్ సెడాన్లలో ఈ ఎయిర్‌బ్యాగ్ సమస్యను గుర్తించినట్లు కంపెనీ తెలిపింది. ఇండియాలో హోండా 2001 నుంచి 2013 మధ్య కాలంలో అకార్డ్ సెడాన్లను విక్రయించింది. ఇటీవలే హోండా భారత్‌లో అకార్డ్ అమ్మకాలను నిలిపివేసింది. అయితే, కొత్త వెర్షన్ అకార్డ్‌ను విడుదల చేసేందుకు పాత మోడల్ అమ్మకాలను నిలిపివేసినట్లు సమాచారం.

ఇదివరకు హోండా భారత్‌లో విక్రయించిన హోండా అకార్డ్ 2.4 లీటర్ ఇంజన్, 3.5 లీటర్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉండేది. ఇందులో 2.4 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 180 పిఎస్‌ల శక్తిని, 225 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 3.5 లీటర్ వి6 పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 275 పిఎస్‌ల శక్తిని, 339 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, June 25, 2014, 15:55 [IST]
English summary
Honda had earlier in the year showcased its updated version of Accord sedan at the 2014 Auto Expo held in New Delhi. The Japanese manufacturer will be recalling the Accord globally, which was sold in ten years ago. The Accord sedan was sold in India too and will be also included in the recall. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+