2338 బ్రయో, అమేజ్, సిఆర్-వి కార్లను రీకాల్ చేసిన హోండా

By Ravi

ఎయిర్‌బ్యాగ్ సమస్య కారణంగా హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సిఐఎల్) కూడా 2338 కార్లను రీకాల్ చేసింది. డ్రైవర్ సైడ్ ఎయిర్‌‌బ్యాగ్ ఇన్‌ఫ్లేటర్‌లోని ఓ భాగాన్ని రీప్లేస్ చేసేందుకు బ్రయో, అమేజ్, సిఆర్-వి కార్లను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ కార్లన్నీ కూడా సెప్టెంబర్ 2011 నుంచి జులై 2014 మధ్య కాలంలో ఉత్పత్తి అయినవని కంపెనీ తెలిపింది. రీకాల్ చేసిన మొత్తం కార్లలో 1040 యూనిట్ల హోండా బ్రయో, 1235 యూనిట్ల హోండా అమేజ్, 63 యూనిట్ల హోండా సిఆర్-వి కార్లున్నట్లు కంపెనీ వివరించింది.


ఎయిర్‌బ్యాగ్ ఇన్‌ఫ్లేటర్‌లో బఫ్ఫెల్ ప్లేట్‌ను సరిగ్గా అమర్చారో లేదో చెక్ చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా హోండా జారీ చేసిన రీకాల్‌లో భాగంగానే, ఇండియాలో కూడా రీకాల్‌ను ప్రకటించినట్లు హోండా కార్స్ ఇండియా విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ రీకాల్‌కు సంబంధించిన కస్టమర్లు సంప్రదించే ప్రక్రియ ప్రారంభించామని, తమ డీలర్‌షిప్‌ ప్రతినిధులు కస్టమర్లను సంప్రదించి, ఈ రీకాల్ గురించి తెలియజేస్తారని, అధీకృత హోండా డీలర్‌షిప్ కేంద్రానికి తీసుకువచ్చే కార్లలో ఈ లోపాని తనిఖీ చేసి, ఉచితంగా స్పేర్‌ను రీప్లేస్ చేస్తామని కంపెనీ తెలిపింది.

Honda Amaze

ఒకవేళ మీరు పైన తెలిపిన హోండా కార్లను ఉపయోగిస్తున్నట్లయితే, మీ కారు కూడా ఈ రీకాల్‌కు వర్తిస్తుందో లేదో తెలుసుకోవాలంటే, హోండా కార్స్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ (www.hondacarindia.com)ను సందర్శించి, తమ వాహనానికి చెందిన 17 అక్షరాలు-అంకెలతో కూడిన వెహికల్ ఐడెంటిఫికేషన్ (విఐఎన్) నెంబరును (ఛాస్సిస్ నెంబర్) నమోదు చేసి తెలుసుకోవచ్చు.

ఈ సమస్య వలన ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, ముందస్తు జాగ్రత్తలో భాగంగానే ఈ రీకాల్‌ను ప్రకటించామని హోండా తెలిపింది. ఈ ఎయిర్‌బ్యాగ్ ఇన్‌ఫ్లేటర్‌లో బఫ్ఫెల్ ప్లేట్‌ను సరిగ్గా అమర్చకపోయినట్లయితే, యాక్సిడెంట్ సమయంలో ఎయిర్‌బ్యాగ్ విచ్చుకొన్నప్పుడు అందులో గాలి పీడనం ఎక్కువై కంటైనర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, October 28, 2014, 9:17 [IST]
English summary
Honda Cars India Ltd (HCIL) today announced that it would carry out preventive replacement of Driver Side Air Bag Inflator of 1040 units of Honda Brio, 1235 units of Honda Amaze and 63 units of Honda CR-V manufactured between September 2011 and July 2014 as part of Honda’s global recall regarding a possible incorrect assembly of the Baffle Plate in the Inflator. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+