జపాన్‌లో హోండా వెజెల్ విడుదల: 2014లో భారత్ ఎంట్రీ
గడచిన నవంబర్ నెలలో జపాన్‌లో జరిగిన 2013 టోక్యో మోటార్ షోలో హోండా మోటార్ కార్పోరేషన్ ఆవిష్కరించిన సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'హోండా వెజెల్' (Honda Vezel)ను కంపెనీ ఇప్పుడు అక్కడి మార్కెట్లో వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న సిఆర్-వి ఫుల్ సైజ్ ఎస్‌యూవీకి దిగువన ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టనున్నారు.
హోండా వెజెల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనో డస్టర్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది. సరికొత్త హోండా జాజ్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని, హోండా ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేసింది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ వెర్షన్లను ఉపయోగించారు. ఇంకా, ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు ఓ హై-అవుట్‌పుట్ ఎలక్ట్రిక్ మోటార్ కలిగిన హైబ్రిడ్ వేరియంట్‌ను కూడా విడుదల చేశారు.
హోండా వెజెల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

జపాన్ మార్కెట్లో హోండా వెజెల్ పెట్రోల్ మరియు హైబ్రిడ్ వేరియంట్లలో మాత్రమే లభ్యం కానుంది. పెట్రోల్ వేరియంట్లో ఉపయోగించిన 1.5 లీటర్ ఇంజన్ గరిష్టంగా 131 పిఎస్‌ల శక్తిని, 155 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్ రెండు రకాల సివిటి (కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్)తో అందుబాటులో ఉంటుంది. ఇది టూవీల్ డ్రైవ్ లేదా ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

హైబ్రిడ్ వేరియంట్ హోండా వెజెల్ రెగ్యులర్ పెట్రోల్ వేరియంట్ కన్నా ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది, దీని రేంజ్ కూడా అధికంగా ఉంటుంది. ఇందులో 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్ స్టాండర్డ్‌గా లభిస్తుంది.

రెగ్యులర్ 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్ హోండా వెజెల్ లీటరుకు 20.6 కి.మీ మైలేజీని (టూవీల్ డ్రైవ్), 19 కి.మీ. మైలేజీని (ఫోర్ వీల్ డ్రైవ్) ఆఫర్ చేస్తుంది. హైబ్రిడ్ వెర్షన్ వెజెల్ లీటరుకు 27 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.

జపాన్ మార్కెట్లో టూవీల్ డ్రైవ్ హోండా వెజెల్ ధరలు 1.87 మిలియన్ యెన్ (రూ.11.14 లక్షలు) నుంచి 2.08 మిలియన్ యెన్ (12.39 లక్షలు)లో ఉండగా, ఫోర్ వీల్ డ్రైవ్ హోండా వెజెల్ ధరలు 2.19 మిలియన్ యెన్ (రూ.13.04 లక్షలు) నుంచి 2.68 మిలియెన్ యెన్ (15.96 లక్షలు) మధ్యలో ఉన్నాయి.

హోండా వెజెల్ డిజైన్‌ను గమనిస్తే దీనిని ఎస్‌యూవీ, కూపే, మినీ వ్యాన్‌లను కలగపి తయారు చేసినట్లుగా అనిపిస్తుంది. అంటే, ఇది ఎస్‌యూవీ లాంటి లక్షణాలను, కూపే లాంటి లుక్‌ను, మినీ వ్యాన్ లాంటి ఫంక్షనాలిటినీ ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

హోండా వెజెల్ ఎక్స్టీరియర్ డిజైన్‌ను గమనిస్తే, సరికొత్త హెడ్‌ల్యాంప్స్, ఆకర్షనీయమైన గ్రిల్, షార్ప్ ఫ్లోటింగ్ బాడీ లైన్స్, స్టయిలిష్ 5-స్పోక్ అల్లాయ్ వీల్స్, స్ప్లిట్ రియర్ టెయిల్ ల్యాంప్, స్లోపింగ్ రూఫ్ లైన్, సి-పిల్లర్ డోర్ హ్యాండిల్స్ (కొత్త చెవర్లే బీట్ మాదిరిగా), రియర్ రూఫ్ స్పాయిలర్ వంటివి ప్రధానంగా చెప్పుకోవచ్చు.

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, హోండా వెజెల్‌లో క్యాబిన్ హైక్వాలిటీ కూపే మాదిరిగా అనిపిస్తుంది. మినీ వ్యాన్ మాదిరి విశాలమైన ఇంటీరియర్ స్పేస్, ఎస్‌యూవీ మాదిరి రగ్గడ్‌తో లుక్‌తో కనిపిస్తుంది. ఇదొక 5-సీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో హోండా తమ వెజెల్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించనుంది. హోండా వెజెల్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








