మారుతి అగ్రస్థానాన్ని చేజిక్కించుకునేందుకు హ్యుందాయ్ ప్లాన్స్

By Ravi

ప్రస్తుతం భారత కార్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి ఇండియాను ఆ స్థానం నుంచి పక్కకు నెట్టేందుకు హ్యుందాయ్ మోటార్ ఇండియా వ్యూహరచనలు చేస్తోంది. ప్రస్తుతం హ్యుందాయ్ ఈ సెగ్మెంట్లో ద్వితీయ స్థానంలో ఉంది. మార్కెట్లో సరికొత్త మోడళ్లను విడుదల చేసి అమ్మకాలను పెంచుకోవటం, తద్వారా లీడర్‌షిప్ స్థానాన్ని సంపాధింకోవటమే ప్రధాన లక్ష్యంగా హ్యుందాయ్ ముందుకు సాగుతోంది.

ఇందులో భాగంగానే, చిన్న కార్ల పోర్టుఫోలియోలో సరికొత్త మోడళ్లను మార్కెట్లో విడుదల చేయనుంది. మారుతి సుజుకి ఆల్టో కె10 మోడల్‌కు పోటీగా కంపెనీ అందిస్తున్న ఇయాన్‌లో ఓ 1.1 లీటరు వేరియంట్‌ను విడుదల చేసేందుకు కంపెనీ యోచిస్తోంది. ఆల్టో 800కు పోటీగా ఇయాన్ (ప్రస్తుత వెర్షన్ 814సీసీ వెర్షన్) లభిస్తున్నప్పటికీ ఆల్టో కె10 (1 లీటర్ వెర్షన్)కు పోటీగా హ్యుందాయ్ నుంచి సరైన కారు లేదు. అందుకే 1.1 లీటర్ ఇంజన్ కలిగి ఇయాన్‌ను ప్రవేశపెట్టాలని హ్యుందాయ్ నిర్ణయించింది.


అయితే, ఈ ఇంజన్ కొత్తదేమీ కాదు. ప్రస్తుతం హ్యుందాయ్ అందిస్తున్న శాంత్రో జింగ్ కారులో ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఆ ఇంజన్‌నే కొత్త ఇయాన్‌లోను ఉపయోగించనున్నారు. హ్యుందాయ్ అక్టోబర్‌ 2011లో ఇయాన్‌ను తొలిసారిగా మార్కెట్లో విడుదల చేసింది. ఆల్టోకు పోటీగా ఈ కారును ప్రవేశపెట్టినప్పటికీ, ఇది ఆశించిన రీతిలో సక్సెస్‌ను సాధించలేదు. (ఆల్టో సరాసరి నెలకు 20,000 యూనిట్ల వరకు అమ్ముడుపోతుండగా, ఇయాన్ నెలకు 7,000-8,000 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోతున్నాయి). ఈ నేపథ్యంలో, మరింత పవర్‌ఫుల్ ఇయాన్‌ను విడుదల చేయాలని హ్యుందాయ్ భావిస్తోంది.

హ్యుందాయ్ ఇప్పటికే ఐ10 గ్రాండ్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. ఇది వచ్చే నెల 3న భారత మార్కెట్లో విడుదల కానుంది. ఇవే కాకుండా, 2014 చివరి నాటికి ఐ20, ఐ10 సెడాన్లను కూడా హ్యుందాయ్ విడుదల చేసే ఆస్కారం ఉంది. మొత్తమ్మీద చూసుకుంటే, 2020 సంవత్సరం నాటికి మారుతి అగ్రస్థానాన్ని కైవసం చేసుకునేందుకు హ్యుందాయ్ కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది.

అయితే, ఈ ఛాలెంజ్‌ను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు మారుతి సుజుకి కూడా ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగానే, వచ్చే ఏడాది ఐ10 గ్రాండ్‌కు పోటీగా ఓ కాంపాక్ట్ డీజిల్ కారును విడుదల చేయనుంది. అంతేకాకుండా, వ్యాగన్ఆర్‌లో కూడా ఓ డీజిల్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకురావటంతో పాటు మరిన్ని కొత్త మోడళ్లను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

Hyundai i10 Grand

More from DriveSpark

Article Published On: Tuesday, August 13, 2013, 14:27 [IST]
English summary
Hyundai Motor India is aiming to become India’s largest car manufacturer in compact car segment by 2020, ending Maruti Suzuki‘s 30 plus years of dominance in the segment. To achieve this, Hyundai will launch four new compact cars over the next 18 months.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+