ఫిబ్రవరి 4, 2014న హ్యుందాయ్ కాంపాక్ట్ సెడాన్ లాంచ్

By Ravi

హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇటీవల విడుదల చేసిన గ్రాండ్ 10 హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఇందులో ఓ కాంపాక్ట్ సెడాన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు మేము ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజాగా.. కంపెనీ ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ.. వచ్చే నెల 4వ తేదీన తమ కాంపాక్ట్ సెడాన్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఈ మేరకు మీడియా ప్రతినిధులకు ఆహ్వానాలు కూడా పంపించింది. కాంపాక్ట్ సెడాన్ ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిచ్చేలా హ్యుందాయ్ తమ కొత్త కాంపాక్ట్ సెడాన్‌ను తయారు చేసింది. ఈ కారును 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు ఒక్క రోజు ముందుగా, అంటే ఫిబ్రవరి 4, 2014వ తేదిన ఢిల్లీలోని హోటల్ తాజ్ ప్యాలెస్‌లో విడుదల చేయనున్నారు.


హ్యుందాయ్ నుంచి రానున్న ఈ కాంపాక్ట్ సెడాన్ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న గ్రాండ్ ఐ10 మాదిరిగానే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటుగా పెట్రోల్ వెర్షన్లో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్లో కూడా లభ్యమయ్యే అవకాశాలున్నాయి. హ్యుందాయ్ తమ కాంపాక్ట్ సెడాన్ పేరు, ధర మరియు ఇతర వివరాలను ఫిబ్రవరి 4న వెల్లడించనుంది. ఆటో ఎక్స్‌పోలో కూడా ఈ మోడల్‌ను ప్రదర్శించనున్నారు.

ఉత్పత్తి వ్యయాన్ని తక్కువగా ఉంచేందుకు, ఈ కాంపాక్ట్ సెడాన్‌ను పూర్తిగా గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసినట్లు సమాచారం. భారత మార్కెట్లో ఇది హ్యుందాయ్‌కు తొలి కాంపాక్ట్ సెడాన్ కానుంది. చిన్న కార్లపై భారత ప్రభుత్వం అందిస్తున్న ఎక్సైజ్ రాయితీలను పొందేందుకు గ్రాండ్ ఐ10 సెడాన్‌ను పొడవులో 4 మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

Hyundai Grand i10

అయితే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ ఇప్పటికే 3765 మి.మీ. పొడవును కలిగి ఉంది. కాబట్టి, గ్రాండ్ ఐ10 కాంపాక్ట్ సెడాన్ విషయంలో ఇది పూర్తి పొడవును ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఉత్పత్తిని ఖర్చును దృష్టిలో ఉంచుకొని అలాగే సరమైన ధరకే దీనిని ఆఫర్ చేసేందుకు, ఇందులో ఇంజన్ల పరంగా కూడా ఎలాంటి మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపించడం లేదు.

ప్రస్తుతం హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగిస్తున్న 1.2 లీటర్ పెట్రోల్, 1.1 లీటర్ డీజిల్ ఇంజన్లనే ఈ కాంపాక్ట్ సెడాన్‌లోను ఉపయోగించే అవకాశం ఉంది. అంతేకాకుండా, హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగిస్తున్న అనేక రకాల విడిభాగాలను (ఇంటీరియర్ పార్ట్స్‌తో కలిపి) ఈ కాంపాక్ట్ సెడాన్‌లో కూడా ఉపయోగించనున్నారు. ఇలా చేయటం అత్యంత సరమైన ధరకే ఈ కారును ఆఫర్ చేసే ఆస్కారం ఉంటుంది. హ్యుందాయ్ కాంపాక్ట్ సెడాన్‌కు సంబంధించిన మరిన్ని తాజా వివరాల కోసం తెలగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, January 25, 2014, 11:23 [IST]
English summary
Hyundai Motor India Ltd. is all set to unveil its first Compact Sedan on Tuesday, February 4th 2014 at the Hotel Taj Palace at 1pm in New Delhi. Stay tuned to drivespark.com for latest updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+